S Ravikumar : పండగపూట టాలీవుడ్‌లో విషాదం.. విజయ నిర్మల సోదరుడు కన్నుమూత..

నేడు అంతా భోగి పండగను సెలబ్రేట్ చేసుకుంటుండగా సీనియర్ నటుడు నరేష్ ఇంట్లో మాత్రం విషాదం నెలకొంది.

S Ravikumar : పండగపూట టాలీవుడ్‌లో విషాదం.. విజయ నిర్మల సోదరుడు కన్నుమూత..

Vijaya Nirmala Brother S Ravi Kumar Passes away

Updated On : January 14, 2024 / 3:31 PM IST

S Ravikumar : టాలీవుడ్(Tollywood) లో పండగ పూట విషాదం నెలకొంది. ఇటీవలే కొన్ని నెలల క్రితం టాలీవుడ్ చంద్రమోహన్ ని కోల్పోగా తాజాగా మరో ప్రముఖుడిని కోల్పోయింది. నేడు అంతా భోగి పండగను సెలబ్రేట్ చేసుకుంటుండగా సీనియర్ నటుడు నరేష్ ఇంట్లో మాత్రం విషాదం నెలకొంది.

సీనియర్ నటుడు నరేష్ మామయ్య, దివంగత నటి, దర్శకురాలు విజయ నిర్మల సోదరుడు ఎస్.రవికుమార్ నేడు ఉదయం కన్నుమూశారు. వయోభారంతో కొన్ని రోజుల నుంచి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రవి కుమార్ నేడు ఉదయం మరణించారు.

Also Read : Mega 156 : మెగా 156.. ఈ సంక్రాంతికి టైటిల్.. వచ్చే సంక్రాంతికి సినిమా.. మెగాస్టార్ టార్గెట్ ఇదే..

విజయనిర్మల స్థాపించిన శ్రీ విజయకృష్ణ మూవీస్ బ్యానర్ కి నిర్మాత ఆమె అయినా, ఆమె సోదరుడు రవికుమార్ ముందుండి సంస్థలో నిర్మాణ పనులన్నీ చూసుకున్నారు. ఆ బ్యానర్ లో తెరకెక్కిన ఎన్నో సినిమాల నిర్మాణంలో దగ్గరుండి పనిచేశారు. ఆయన మరణంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. నరేష్, వారి కుటుంబ సభ్యులు, పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.