Vikram : దాదాపు ఐదేళ్ల తర్వాత విక్రమ్‌ స్పై యాక్షన్ మూవీకి మోక్షం..! ‘ధ్రువనక్షత్రం’ నుంచి జాన్ కమింగ్..?

2017లోనే రిలీజ్ కావాల్సిన విక్రమ్ 'ధ్రువనక్షత్రం' మూవీ.. ఇప్పుడు రిలీజ్ సిద్దమవుతుంది.

Vikram : దాదాపు ఐదేళ్ల తర్వాత విక్రమ్‌ స్పై యాక్షన్ మూవీకి మోక్షం..! ‘ధ్రువనక్షత్రం’ నుంచి జాన్ కమింగ్..?

Vikram Dhruva Natchathiram Chapter One Yuddha Kaandam is ready to be release

Vikram : తమిళ్ స్టార్ హీరో విక్రమ్ ఈ ఏడాది పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. ప్రస్తుతం ఈ వెర్సటైల్ యాక్టర్ తంగలాన్ (Thangalaan) సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ లేదు. ఇది ఇలా ఉంటే, ఐదేళ్ల క్రిందట రిలీజ్ అవ్వాల్సిన విక్రమ్ నటించిన ఒక సినిమా.. ఇప్పుడు విడుదలకు సిద్దమవుతుంది. ‘ధ్రువనక్షత్రం’ అనే టైటిల్ తో విక్రమ్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా చేశాడు.

Raviteja – Baby : బేబీ మూవీకి రవితేజ ప్రశంసలు.. ఏమి అన్నాడంటే..!

స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా 2017లోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనేక కారణాలు వల్ల ఆ మూవీ వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాలో రీతువర్మ, ఐశ్వర్య రాజేష్, రాధికా, సిమ్రాన్, అర్జున్ దాస్ వంటి స్టార్ క్యాస్ట్ నటిస్తుంది. ఈ మూవీ నుంచి ఆల్రెడీ ఒక సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ నుంచి రెండో సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు దర్శకుడు ప్రకటించాడు. ఈ నెల 19న ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ ‘హిస్ నేమ్ ఈజ్ జాన్’ని రిలీజ్ చేయబోతున్నారు. సాంగ్ ప్రోమోని కూడా రిలీజ్ చేశారు.

Saindhav : ‘హార్ట్ ఆఫ్ సైంధవ్‌’ని పరిచయం చేసిన వెంకటేష్.. కథ మొత్తం ఈ పాత్ర చుట్టే..!

హరీష్ జయరాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించనున్నారట. కాగా ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుంది. న్యూయార్క్ సిటీలో అండర్ కవర్ ఆపరేషన్ నేపథ్యంతో సాగే ఈ కథ మోత నాలుగు గంటల పైనే వచ్చిందట. అందుకే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. ‘చాప్టర్ వన్ – యుద్ధ కాండం’ అనే టైటిల్ తో మొదటి పార్ట్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.