Mahaan : ‘మనం పెట్టిందే చట్టం.. పోసేదే మద్యం’.. టీజర్ అదిరిందిగా..

‘చియాన్’ విక్రమ్.. ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ హీరోలుగా.. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో వస్తున్న ‘మహాన్’ ఫిబ్రవరి 10న విడుదల కాబోతుంది..

Mahaan : ‘మనం పెట్టిందే చట్టం.. పోసేదే మద్యం’.. టీజర్ అదిరిందిగా..

Mahaan

Updated On : January 31, 2022 / 12:45 PM IST

Mahaan: ‘చియాన్’ విక్రమ్.. ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ హీరోలుగా.. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా ‘మహాన్’. విక్రమ్ నటిస్తున్న 60వ సినిమా ఇది. వాణి భోజన్, సిమ్రాన్, బాబీ సింహా ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్ల విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చెయ్యాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. తీసుకున్నారు. ‘మహా పురుష’ పేరుతో కన్నడలో రిలీజ్ చెయ్యబోతున్నట్లు అనౌన్స్ చేశారు. తెలుగులో ‘మహాన్’ పేరుతో విడుదల చెయ్యబోతున్నట్లు తెలుపుతూ.. సోమవారం టీజర్ వదిలారు.

Cobra Movie : విక్రమ్ ‘కోబ్రా’ పరిస్థితి ఏంటి?

మద్యపాన నిషేదం కోసం పోరాడిన ఫ్యామిలీ నుండి వచ్చిన విక్రమ్ (మహాన్).. తాత ఆశయాలను తుంగలో తొక్కి.. అదే మద్యం సిండికేట్‌ని శాసించే వ్యక్తిగా చూపించారు. విక్రమ్ పలు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించారు. టీజర్ చివర్లో ధృవ్ విక్రమ్ ‘దాదా’ గా కనిపించనున్నట్లు రివీల్ చేశారు.

NTR 30-Thalapathy Vijay : అనిరుధ్ ఫిక్స్.. హెయిర్ స్టైలిష్‌తో విజయ్..

‘మహాన్’ టీజర్ ట్రెండింగ్‌లో ఉంది. సిమ్రాన్, బాబీ సింహా క్యారెక్టర్లు సినిమాకే హైలెట్ అని తెలుస్తుంది. శ్రేయాస్ కృష్ణ విజువల్స్, సంతోష్ నారాయణన్ ఆర్ఆర్ టీజర్‌లో హైలెట్ అయ్యాయి. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఫిబ్రవరి 10 నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.