Lamp Movie : 110 రూపాయలకే సినిమా టికెట్.. ‘ల్యాంప్’ రిలీజ్ ఎప్పుడంటే..
రాకేష్ మాస్టర్ నటించిన చివరి సినిమా ఇది.

Vinod Kumar Tells about Lamp Movie and Release Date
Lamp Movie : సూపర్ హిట్ సినిమా ఏడు చేపల కథ నిర్మాతలు శేఖర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి నిర్మాణంలో డైరెక్టర్ రాజశేఖర్ దర్శకత్వంలో ఈ ల్యాంప్ సినిమా తెరకెక్కుతుంది. వినోద్ కుమార్, మధుప్రియ జంటగా కోటి, కిరణ్, అవంతిక, వెంకీ, నాగేంద్ర. చలపతి.. పలువురు ముఖ్య పాత్రల్లో ల్యాంప్ తెరకెక్కించారు. రాకేష్ మాస్టర్ నటించిన చివరి సినిమా ఇది. ల్యాంప్ సినిమా మార్చ్ 14న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా హీరో వినోద్ కుమార్ మీడియాతో ముచ్చటించారు.
వినోద్ కుమార్ ఈ సినిమా కథ గురించి మాట్లాడుతూ.. మా ల్యాంప్ సినిమా ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. వరుస హత్యలు జరుగుతున్న నేపథ్యంలో అందులోకి హీరో ఎలా ఎంటర్ అయ్యాడు, వాటిని ఎలా ఆపాడు అని ఆసక్తిగా ఉంటుంది. ఈ సినిమాలో నేను ఒక కానిస్టేబుల్ పాత్రలో కనిపిస్తాను. సస్పెన్స్ మెయింటైన్ చేస్తూనే కామెడీ పండిస్తాను అని తెలిపారు.
సినిమా రిలీజ్ గురించి మాట్లాడుతూ.. గ్రాఫిక్స్ వర్క్ లు అవి ఉండటం వల్ల సినిమా లేట్ అయింది. 150 థియేటర్లలో సినిమా రిలీజ్ చేస్తున్నాము. మా ట్రైలర్ నచ్చి డిస్ట్రిబ్యూటర్లే మాకు ఎదురు డబ్బులు ఇచ్చి మరీ సినిమా రిలీజ్ చేస్తామన్నారు. మార్చి 14న ల్యాంప్ సినిమా థియేటర్స్ లలో విడుదల చేస్తున్నాం. అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో మా సినిమా టికెట్ రేట్ ని 110 రూపాయలుగానే నిర్ణయించాము అని తెలిపారు.
అలాగే.. ఇటీవల చాలామంది సినిమాల్లో నటించాలని వచ్చి మోసపోతున్నారు. ఏమీ నేర్చుకోకుండా వచ్చి ఇబ్బందులు పడుతున్నారనే నేను వినోద్ ఫిలిం అకాడమీ స్థాపించి వాళ్లకు గైడెన్స్ ఇస్తున్నాను. మా అకాడమీలో యాక్టింగ్ నేర్చుకున్న విద్యార్థులకు మేమే అవకాశాలు చూపిస్తున్నాము. కొత్తగా సినిమా తీయాలనుకునే యువ దర్శకులు, నిర్మాతలకు సపోర్ట్ గా ఉండటానికి మా అకాడమీ నుంచి స్టూడెంట్స్ ని ఆర్టిస్టులుగా కూడా ఇస్తున్నాను. ల్యాంప్ తర్వాత బార్బరీక్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. శాసనమా చట్టమా అనే సినిమాలో హీరో సుమన్ గారి కొడుకు పాత్ర చేస్తున్నాను. మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాను అని తెలిపారు వినోద్.