Virupaksha: యూఎస్ బాక్సాఫీస్ దగ్గర తగ్గేదే లే అంటోన్న ‘విరూపాక్ష’

హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ యూఎస్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ఈ సినిమాకు అక్కడ సాలిడ్ కలెక్షన్స్ వస్తుండటంతో త్వరలోనే మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

Virupaksha: యూఎస్ బాక్సాఫీస్ దగ్గర తగ్గేదే లే అంటోన్న ‘విరూపాక్ష’

Virupaksha Solid Collections Continue At US Box Office

Updated On : April 25, 2023 / 11:20 AM IST

Virupaksha: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ బాక్సాఫీస్ వద్ద తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మిస్టిక్ థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దర్శకుడు కారతీక్ దండు తెరకెక్కించిన ఈ సినిమాలోని హార్రర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను సినిమా చూస్తున్నంతసేపు ఉత్కంఠానికి గురిచేశాయి. ఇక ఈ సినిమాతో తేజు సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Virupaksha: విరూపాక్ష-2 పై సాయి ధరమ్ తేజ్ క్లారిటీ.. ఏమన్నాడంటే..?

కాగా, ఈ సినిమాకు తొలిరోజునే పాజిటివ్ టాక్ రావడంతో ఆ ప్రభావం సినిమా వసూళ్లపై పడింది. తొలిరోజే బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.12 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా.. తొలి వారాంతం ముగిసే సరికి వరల్డ్‌వైడ్‌గా రూ.44 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా ఇప్పటివరకు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 850K డాలర్ల వసూళ్లు సాధించినట్లు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ వెల్లడించారు. ఈ సినిమా జోరు అక్కడ కంటిన్యూ అవుతుండటంతో ఈ వారంలో మిలియన్ డాలర్ క్లబ్‌లో విరూపాక్ష చేరడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Virupaksha: మూడు రోజుల్లో అదరగొట్టిన విరూపాక్ష.. హాఫ్ సెంచరీకి చేరువలో తేజు మూవీ!

ఇక ఈ సినిమాలో తేజుతో పాటు సంయుక్తా మీనన్‌ల పర్ఫార్మెన్స్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఈ సినిమాకు మేజర్ అసెట్‌గా నిలిచింది. సుకుమార్ రైటింగ్స్, బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. మరి ఈ సినిమా టోటల్ రన్‌లో ఎలాంటి వసూళ్లు రాబడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.