Vishal : అది జస్ట్ ప్రాంక్ వీడియోరా బాబు.. నేను ఏ అమ్మాయితో తిరగట్లేదు.. క్లారిటీ ఇచ్చిన విశాల్..

ప్రస్తుతం విశాల్ న్యూయార్క్(New York) సిటీలో ఉన్నాడు. అక్కడ వీధుల్లో ఎవరో అమ్మాయితో విశాల్ చక్కర్లు కొడుతూ కనిపించారు.

Vishal : అది జస్ట్ ప్రాంక్ వీడియోరా బాబు.. నేను ఏ అమ్మాయితో తిరగట్లేదు.. క్లారిటీ ఇచ్చిన విశాల్..

Vishal gives Clarity on his Viral Video Roaming with a Girl in New York

Updated On : December 28, 2023 / 8:48 AM IST

Hero Vishal : హీరో విశాల్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. రీసెంట్ గా ‘మార్క్ ఆంటోనీ’ అనే టైం ట్రావెల్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ కొట్టారు. ప్రస్తుతం ‘రత్నం’, ‘డిటెక్టివ్ 2’ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే గత మూడు రోజులుగా విశాల్ కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ప్రస్తుతం విశాల్ న్యూయార్క్(New York) సిటీలో ఉన్నాడు. అక్కడ వీధుల్లో ఎవరో అమ్మాయితో విశాల్ చక్కర్లు కొడుతూ కనిపించారు. తనని వీడియో తీస్తున్నారని గమనించిన విశాల్.. వెంటనే తన మొహాన్ని దాచుకున్నారు. దీంతో ఈ వీడియో వైరల్ అవ్వగా.. కొందరు నెటిజెన్స్ ఆ అమ్మాయి ఎవరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఇది కొత్తరకం సినిమా ప్రమోషన్ అంటూ కామెంట్స్ చేశారు.

Also Read : Vishal : న్యూయార్క్ సిటీలో ఎవరో అమ్మాయితో విశాల్ వీడియో వైరల్.. మొహం దాచుకున్న హీరో..!

తాజాగా ఆ వీడియోపై విశాల్ క్లారిటీ ఇచ్చారు. విశాల్ తన ట్విట్టర్ లో ఆ వీడియో గురించి స్పందిస్తూ.. సారీ, రీసెంట్ గా వచ్చిన వీడియో గురించి మీకు నిజం చెప్పాలి. అందులో కొంచెం నిజం ఉంది. నేను న్యూయార్క్ లోనే ఉన్నాను. రెగ్యులర్ గా సంవత్సరం అంతా కష్టపడి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడానికి న్యూయార్క్ లో నా కజిన్స్ ఉండే ప్లేస్ కి వెళ్తాను. ఇక మిగిలిన సగం అది ప్రాంక్. నేను, నా కజిన్స్ క్రిస్మస్ రోజు సరదాగా చేసింది. నాలో ఉన్న చిన్నపిల్లాడు ఎప్పుడూ బయటకి వచ్చి ఇలా సరదాగా ఎంజాయ్ చేయడానికి ఫిక్స్ అవుతాడు. మీ డిటెక్టివ్ ఆలోచనలకు ఇక ముగింపు చెప్పండి. కొంతమంది టార్గెట్ చేసి మరీ రాసారు. నేను దీన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. లవ్ యు ఆల్ అని పోస్ట్ చేశారు.