Rathnam : విశాల్ ‘రత్నం’ రిలీజ్ డేట్‌ అనౌన్స్.. వేసవికి డబ్బింగ్ సినిమాల సందడి కనిపిస్తుందిగా..

విశాల్ కొత్త సినిమా 'రత్నం' రిలీజ్ డేట్‌ ని మూవీ టీం అనౌన్స్ చేసింది. ఈసారి టాలీవుడ్ వేసవి బరిలో డబ్బింగ్ సినిమాల సందడి కనిపిస్తుందిగా..

Rathnam : విశాల్ ‘రత్నం’ రిలీజ్ డేట్‌ అనౌన్స్.. వేసవికి డబ్బింగ్ సినిమాల సందడి కనిపిస్తుందిగా..

Vishal hari new movie Rathnam release date announced

Updated On : January 25, 2024 / 11:33 AM IST

Rathnam : తెలుగు ఆడియన్స్ భాషతో సంబంధం లేకుండా ప్రతి సినిమాని ఆదరిస్తుండడంతో.. ఇతర పరిశ్రమకు చెందిన సినిమాలను కూడా ఇక్కడ సీజన్స్ టైంలో తెలుగు సినిమాలకు పోటీగా తీసుకు వచ్చేస్తున్నారు. ఈక్రమంలోనే ఈ సమ్మర్ కి తెలుగు చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాల సందడి గట్టిగానే కనిపించబోతుందని తెలుస్తుంది. తమిళం నుంచి మొత్తం మూడు సినిమాలు టాలీవుడ్ వేసవి బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యాయి.

తమిళ హీరో విశాల్, దర్శకుడు హరితో తెరకెక్కిస్తున్న ‘రత్నం’ మూవీ రిలీజ్ డేట్‌ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్లు ప్రకటించారు. విశాల్, హరి కాంబోలో ఇప్పటికే భరణి, పూజ వంటి మాస్ సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మూడోసారి బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి తమ మాస్ ని చూపేందుకు విశాల్, హరి రెడీ అవుతున్నారు.

Also read : Double ISmart : ఒక్క క్లైమాక్స్ కోసం అంత ఖర్చు పెడుతున్నారా.. పూరీ మళ్ళీ రిస్క్ చేస్తున్నారా..!

Vishal Rathnam release date announced

కాగా ఈ ఏప్రిల్ నెలలోనే విక్రమ్ ‘తంగలాన్’, సూర్య ‘కంగువ’ కూడా రిలీజ్ కాబోతున్నాయి. మూడు సినిమాల రిలీజ్ కి అటు ఇటు తెలుగు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ ‘దేవర’ ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆ మూవీ పోస్టుపోన్ అయ్యినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ న్యూస్ నిజమైతే.. అదే తేదికి విజయ్ దేవరకొండ ‘ఫామిలీ స్టార్’ రావడానికి సిద్ధంగా ఉంది.

ఇక మొదటి వారం తరువాత ఏప్రిల్ చివరి వారం వరకు తమిళ సినిమాల రిలీజ్ లు మొదలు కాబోతున్నాయి. ఆ తరువాత మే మొదటి వారంలో ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ కాబోతుంది. ఇలా సమ్మర్ కి టాలీవుడ్ లో తెలుగు చిత్రాలు కంటే తమిళ సినిమాల సందడి ఎక్కువ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఆ సమయానికి ఏది రిలీజ్ అవుతుందో, ఏది తప్పుకుంటుందో చూడాలి.