Double ISmart : ఒక్క క్లైమాక్స్ కోసం అంత ఖర్చు పెడుతున్నారా.. పూరీ మళ్ళీ రిస్క్ చేస్తున్నారా..!

'డబల్ ఇస్మార్ట్' మూవీలో ఒక్క క్లైమాక్స్ కోసమే కోట్లు ఖర్చు పెడుతున్న పూరిజగన్నాథ్.

Double ISmart : ఒక్క క్లైమాక్స్ కోసం అంత ఖర్చు పెడుతున్నారా.. పూరీ మళ్ళీ రిస్క్ చేస్తున్నారా..!

Puri Jagannadh spend crores of money for Ram Pothineni Double ISmart

Updated On : January 25, 2024 / 10:54 AM IST

Double ISmart : పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’.. 2019లో రిలీజయ్యి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఆ చిత్రంలో ఊరమాస్‌ని సైన్స్‌తో జతచేసిన పూరీ టేకింగ్ కి ఆడియన్స్ ని థ్రిల్ ఫీల్ అయ్యారు. ఇక ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో.. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ‘డబల్ ఇస్మార్ట్’ని తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక ఈ మూవీలోని క్లైమాక్స్ సన్నివేశం కోసం పూరీ భారీగా ఖర్చుపెడుతున్నారట. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చివరి సినిమా ‘లైగర్’ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి పూరీనే నిర్మాతగా వ్యవహరించారు. మూవీ డిజాస్టర్ అవ్వడంతో అనేక ఆర్ధిక ఇబ్బందలతో పాటు సమస్యలను కూడా తెచ్చిపెట్టింది.

Also read : Balakrishna : బాలకృష్ణ గారి కోసం రెండు కథలు సిద్ధం చేశా.. ఒకటి సూపర్ హీరో మూవీ.. ప్రశాంత్ వర్మ

ఇప్పుడు ఈ డబల్ ఇస్మార్ట్ ని కూడా పూరీనే నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలోని క్లైమాక్స్ సీన్ కోసమే దాదాపు రూ.7 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. రెండు వారాలు పాటు ఈ క్లైమాక్స్ ని చిత్రీకరించబోతున్నారట. లైగర్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పూరీ.. ఇప్పుడు మళ్ళీ ఇస్మార్ట్ తో రిస్క్ చేస్తున్నారా..? అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే పూరీ మాత్రం స్క్రిప్ట్ మీద, ఇస్మార్ట్ క్రేజ్ మీద నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తుంది.

కాగా ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. కావ్య తాపర్ హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా ఈ మూవీ రిలీజ్ కానుంది. పాన్ ఇండియా ఆడియన్స్ ని అలరించేలా పూరీ ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. మరి లైగర్ తో నిరాశ పరిచిన పూరీ.. ఈ మూవీతో మెప్పిస్తారు అనేది చూడాలి.