Rathnam Trailer : తిరుపతి కోసం ఆంధ్రా, తమిళనాడు గొడవ.. మధ్యలో ప్రేమకథ.. ‘రత్నం’ ట్రైలర్ చూశారా..

విశాల్ 'రత్నం' ట్రైలర్ చూశారా. తిరుపతి కోసం ఆంధ్రా, తమిళనాడు గొడవ బ్యాక్ డ్రాప్ తో ఒక మాస్ ప్రేమ కథ.

Rathnam Trailer : తిరుపతి కోసం ఆంధ్రా, తమిళనాడు గొడవ.. మధ్యలో ప్రేమకథ.. ‘రత్నం’ ట్రైలర్ చూశారా..

Vishal Priya Bhavani Shankar Rathnam Movie telugu Trailer

Updated On : April 15, 2024 / 5:40 PM IST

Rathnam Trailer : తమిళ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ‘రత్నం’. షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ ఫుల్ స్వింగ్ లో చేస్తుంది. ఈక్రమంలోనే టీజర్ అండ్ సాంగ్స్ ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

తెలుగు, తమిళనాడు స్టేట్స్ విడిపోయిన తరువాత బోర్డర్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు.. అటు ఇటు సమానంగా వెళ్లిపోయాయి. ఈక్రమంలోనే తిరుపతి ఆంధ్రాకి వచ్చి చేరింది. అయితే చాలామంది తమిళియన్స్.. తిరుపతి తమదే అంటూ ఇప్పటికి వాదిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ గొడవ నేపథ్యంతోనే రత్నం సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. అయితే ఈ గొడవ మధ్యలో ఓ ప్రేమకథని చూపించబోతున్నారు.

Also read : Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ సినిమాటిక్ యూనివర్స్.. అర్జున్ రెడ్డి, యానిమల్, స్పిరిట్‌తో..

ప్రియా భవాని శంకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే కథ అంతా హీరోయిన్ పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. గతంలో భరణి, పూజ వంటి సూపర్ హిట్ సినిమాలతో ఆకట్టుకున్న విశాల్, హరి కాంబో.. ఈసారి ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటారో చూడాలి.