Vishnu Priya: నెట్ లో వీడియో లీక్.. సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. మా తాతయ్య కాల్ చేసి..
టాలీవుడ్ యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీవీ షోల ద్వారా (Vishnu Priya)బాగా పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. ఇక సుడిగాలి సుధీర్ తో ఆమె చేసిన పోవే పోరా గేమ్ షో ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Vishnu Priya makes emotional comments about her fake video that went viral on social media
Vishnu Priya: టాలీవుడ్ యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీవీ షోల ద్వారా బాగా పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. ఇక సుడిగాలి సుధీర్ తో ఆమె చేసిన పోవే పోరా గేమ్ షో ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షోనే ఆమెకు ఎనలేని ఫేమ్ తీసుకువచ్చింది. అదే ఫేమ్ తో బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టింది. స్టార్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ లవ్ కంటెంట్ ఇచ్చి మధ్యలోనే (Vishnu Priya)ఇంటిదారి పట్టింది. అప్పటి నుంచి టీవీ షోలలో కనిపిస్తూ వస్తోంది. అయితే, ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కనిపించే విష్ణు ప్రియ జీవితంలో కూడా కొన్ని డార్క్ నైట్స్ ఉన్నాయట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన లైఫ్ లో జరిగిన ఎమోషనల్ సిచువేషన్ గురించి చెప్తూ భావోద్వేగానికి లోనయ్యింది.
Peddi: మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ.. పెద్ది సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. బుచ్చిబాబు చెప్పేశాడు
కొంతకాలం క్రితం నా మార్పింగ్ వీడియో ఒకటి నెట్ లో విడుదలయ్యింది. అది అసభ్యకరమైన వీడియో. నాకు కూడా ఆ వీడియో వాట్సాప్ చేశారు. అది చూసి షాకయ్యాను. చాలా మంది అది నేనే అనుకున్నాను. చెప్పినా కూడా నమ్మలేదు. అదే సమయంలో నా పేస్ బుక్ కూడా హ్యాక్ అయ్యింది. వాటిలో కూడా ఆ వీడియోలను షేర్ చేశారు. వాటిని మా తాతయ్య చూసి మా అమ్మమ్మకు కాల్ చేసి విష్ణు ఏంటి ఎలాంటి పోస్టులు పెట్టింది అని అడిగాడు. నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా మంది నా ముందే ఆ వీడియోల గురించి మాట్లాడేవారు. కొంతమంది ఆ వీడియోల గురించి నా దగ్గరే మాట్లాడేవారు.
ఆ సమయంలో చాలా బాధేసింది. సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. కానీ, మా అమ్మ చెప్పిన ధైర్యం వల్లే ఇప్పుడు ఇక్కడ ఉన్నా. లేదంటే ఎప్పుడు చచ్చిపోయేదాన్ని”అంటూ చెప్పుకొచ్చింది విష్ణు ప్రియ. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ మాటలువిన్న నెటిజన్స్ సైతం ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకరి సక్సెస్ ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే దాని వెనకాల చాలా కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. వాటిని దాటుకొని ముందుకు రావడం అనేది చాలా గ్రేట్ అనే చెప్పాలి. విష్ణు నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
