Peddi: మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ.. పెద్ది సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. బుచ్చిబాబు చెప్పేశాడు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. పాన్ ఇండియా లెవల్లో (Peddi)ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
Ram charan Peddi movie first song release on November 8th
Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. పాన్ ఇండియా లెవల్లో ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. రూరల్ బ్యాక్డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు(Peddi) బుచ్చిబాబు. ఇక ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్ చేస్తుండటం విశేషం. గేమ్ ఛేంజర్ ప్లాప్ తరువాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి. అదే రేంజ్ లో ఇప్పటివరకు పెద్ది నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఉండటంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు.
Emraan Hashmi: అసూయ లేని వ్యక్తి.. అందుకే ఆయన ప్రత్యేకం.. ఓజీ తరువాత నేను కూడా..
ఇక రామ్ చరణ్ కూడా గతంలో ఎన్నడూ లేని విదంగా పెద్ది సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. తన ఫ్యాన్స్ కలర్ ఎగరేసేలా సినిమాను తీసుకొచ్చేందుకు చాలా కష్ట పడుతున్నాడు. ఈ సినిమా 2026 మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, రీసెంట్ గా దర్శకుడు బుచ్చిబాబు పెద్ది ఫస్ట్ సాంగ్ రిలీజ్ గురించి హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలో ఈ సినిమా నుంచి లవ్ సాంగ్ రాబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఏకంగా సాంగ్ విడుదలయ్యే డేట్ కూడా ప్రకటించాడు. నవంబర్ 8న హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఏఆర్ రహమాన్ మ్యూజిక్ కాన్సర్ట్ అన్నవిషయం తెలిసిందే.
భారీ ఎత్తున ఈ ఈవెంట్ జరుగనుంది. ఈ ఈవెంట్ లోనే పెద్ది సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల కానున్నట్టు ప్రకటించాడు బుచ్చిబాబు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పెద్ది సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఈ న్యూస్ కాస్త రిలీఫ్ ఇచ్చింది అనే చెప్పాలి. ఇక పెద్ది సినిమా విషయంలో ఈ ఫస్ట్ సింగ్ కీలకం కానుంది. ఇది సూపర్ హిట్ అయితే ఈ ఎఫెక్ట్ సినిమాపై ఒక రేంజ్ లో పడే అవకాశం ఉంది. లేదంటే, రహమాన్ సైతం ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి చూడాలి పెద్ది నుంచి వస్తున్న ఫస్ట్ సినిమాపై ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా అని.
