Emraan Hashmi: అసూయ లేని వ్యక్తి.. అందుకే ఆయన ప్రత్యేకం.. ఓజీ తరువాత నేను కూడా..
బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.(Emraan Hashmi) బాలీవుడ్ సినిమాలను ఇష్టపడే వారికి ఆయన గురించి చాలా బాగా తెలుసు. రొమాంటిక్ సీన్స్ చేయడంలో ఆయనే నంబర్ వన్ అని చెప్పాలి.
 
                            Bollywood star Emraan Hashmi heaps praise on Pawan Kalyan
Emraan Hashmi: బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ సినిమాలను ఇష్టపడే వారికి ఆయన గురించి చాలా బాగా తెలుసు. రొమాంటిక్ సీన్స్ చేయడంలో ఆయనే నంబర్ వన్ అని చెప్పాలి. ఇటీవలే ఆయన ఓజీ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో విలన్ గా ఓమి పాత్రలో నటించి తనదైన శైలీలో మెప్పించాడు ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi). ఆ పాత్రలో ఆయన తప్పా ఇంకెవరు చేయలేరు అనే రేంజ్ లో మెప్పించాడు. చాలా మంది ఆయన ఫ్యాన్స్ అయ్యారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Baahubali The Epic: బాహుబలి ఎపిక్ విడుదల.. ఆగ్రహంలో ఫ్యాన్స్.. అలా ఎలా తీసేస్తారు..
తాజాగా ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల ఇమ్రాన్ హష్మీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. “ఓజీ సినిమా చేయడం ఒక గొప్ప అనుభూతి. పవన్ కళ్యాణ్ తో నటించడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయన చాలా వినయంగా ఉంటారు. ఆయనతో నటించినప్పుడు ఎలాంటి అసూయ లేకుండా మీకు ప్రాధాన్యత ఇస్తారు. తనపని తాను చేసుకోని వెళ్ళిపోతారు. ఆ క్వాలిటీ చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఆ క్వాలిటీనే ఆయన్ని మిగతావారి నుంచి ప్రత్యేకంగా ఉంచింది” అంటూ చెప్పుకొచ్చాడు ఇమ్రాన్ హష్మీ. దీంతో పవన్ కళ్యాణ్ పై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే, పవన్ ఫ్యాన్స్ ఇమ్రాన్ హష్మీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ఓజీ సినిమాకు ప్రీక్వెల్, సీక్వెల్ సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలను అధికారికంగా ప్రకటించాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం దర్శకుడు సుజీత్ నేచురల్ స్టార్ నానితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఓజీ ప్రీక్వెల్, సీక్వెల్ సినిమాల షూటింగ్స్ మొదలుకానున్నాయి. అంతకన్నా ముందే పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2026 శివరాత్రికి విడుదల అయ్యే అవకాశం ఉంది.






