Vishwak Sen : విశ్వక్ సేన్ ‘గామి’ రిలీజ్ డేట్ అనౌన్స్
నాలుగు సంవత్సరాల నిరీక్షణ తర్వాత విశ్వక్ సేన్ 'గామి' రిలీజ్ కాబోతోంది. రిలీజ్ డేట్‌ను చిత్రయూనిట్ ప్రకటించింది.

Vishwak Sen
Vishwak Sen : విశ్వక్ సేన్ ‘గామి’ ఎట్టకేలకు రిలీజ్ కాబోతోంది. వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది.
Bollywood : బాలీవుడ్‌లో మరో స్టార్ కపుల్ విడాకులు.. ఎవరో తెలుసా?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కాంపౌండ్ నుండి రావాల్సిన ‘గామి’ సినిమా సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. నాలుగు సంవత్సరాల నిరీక్షణ అనంతరం మార్చి 8న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. విద్యాధర్ డైరెక్షన్‌లో కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో కనిపించబోతున్నారు. హిమాలయాలు, వారణశి వంటి ప్రాంతాల్లో సినిమా షూట్ చేసినట్లు సమాచారం. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా వస్తున్న ఈ మూవీలో చాందినీ చౌదరి హీరోయిన్ కాగా ఎంజి అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Family Star : ఫ్యామిలీ స్టార్ నుండి ‘నందనందనా’ లిరికల్ సాంగ్ రిలీజ్
విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ కూడా గతేడాది డిసెంబర్ మొదటివారంలో రిలీజ్ కావాల్సి ఉంది. షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో సినిమా వాయిదా వేసారు. తిరిగి మార్చి 8న రిలీజ్ డేట్ అంటూ ప్రకటించారు. మళ్లీ ఆ సినిమా వాయిదా పడింది. ఇక ఆ డేట్ లో ‘గామి’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. విశ్వక్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ ఏప్రిల్ రిలీజ్ ఎక్స్‌పెక్ట్ చేయచ్చు.
View this post on Instagram