Vishwak Sen : సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ ఛాలెంజ్.. రీల్స్ చేయండి.. లక్ష గెలవండి..

సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ కాంటెస్ట్ ప్రకటించే కార్యక్రమం నిర్వహించగా ఈ ఈవెంట్ కు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గెస్ట్ గా వచ్చాడు.

Vishwak Sen :  సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ ఛాలెంజ్.. రీల్స్ చేయండి.. లక్ష గెలవండి..

Vishwak Sen as Guest For A Social Media Influencers Reel Challenge Contest

Updated On : August 16, 2024 / 9:21 PM IST

Vishwak Sen : హైదరాబాద్ లోని థ్రిల్ సిటీ – అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ తాజాగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ కి ఓ కాంటెస్ట్ పెట్టింది. ఈ థ్రిల్ సిటీ – థీమ్ పార్క్ లో ఉన్న ఫన్ గేమ్స్, అడ్వెంచర్ గేమ్స్, హార్రర్ మేజ్, 12D థియేటర్.. ఇలాంటివన్నిటిని ఆధారంగా తీసుకొని ఒక వీడియో రీల్ షూట్ చేయాలి. అలా షూట్ చేసి పోస్ట్ చేసిన వీడియోల నుంచి బెస్ట్ టాప్ మూడు రీల్స్ ని ఎంపిక చేసి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ కాంటెస్ట్ ప్రకటించే కార్యక్రమం నిర్వహించగా ఈ ఈవెంట్ కు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గెస్ట్ గా వచ్చాడు. ఈ ఈవెంట్లో కాంటెస్ట్ ప్రకటించిన అనంతరం విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో సోషల్ మీడియా లేకుండా ఏ బిజినెస్ జరగట్లేదు. చాలామంది తమ ట్యాలెంట్ ని సోషల్ మీడియాలోనే చూపిస్తున్నారు. ఈ కాంటెస్ట్ లో పాల్గొని రీల్స్ చేసి లక్ష రూపాయలు గెలుచుకోండి అని తెలిపారు.

Also Read : Ram Charan : ఆస్ట్రేలియాలో చరణ్‌ కోసం ఎగబడ్డ అభిమానులు.. ఆ జనాలు ఏందిరా బాబు..

థ్రిల్ సిటీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ ఛాలెంజ్ కార్యక్రమం కో ఆర్డినేటర్ బందూక్ లక్ష్మణ్ మాట్లాడుతూ… వచ్చే రీల్స్ నుంచి మూడు విభాగాల్లో ముగ్గురు విజేతలను ఎంపిక చేసి ప్రముఖ దర్శకుల ఆధ్వర్యంలో విన్నర్స్ అనౌన్స్ చేసి వారికి లక్ష రూపాయల చొప్పున నగదు బహుమతి ఇస్తామని తెలిపారు.