Ram Charan : ఆస్ట్రేలియాలో చరణ్ కోసం ఎగబడ్డ అభిమానులు.. ఆ జనాలు ఏందిరా బాబు..
రామ్ చరణ్ తాజాగా ఆస్ట్రేలియా వెళ్ళాడు.

Ram Charan Went to Australia huge Fans and People assembled for Charan in Melbourne
Ram Charan : మామూలుగానే సెలబ్రిటీలు కనిపిస్తే జనాలు సెల్ఫీల కోసం, వాళ్ళని కలవడానికి ఎగబడతారు. ఇక స్టార్ హీరోలు వస్తున్నారంటే భారీగా ఫ్యాన్స్ చేరుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆశ్చర్యపోనవసరం లేదు కానీ వేరే దేశాల్లో కూడా ఇప్పుడు మన హీరోల కోసం జనాలు భారీగా వస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమాతో దేశ వ్యాప్తంగానే కాక పాన్ వరల్డ్ గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. రామ్ చరణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది.
రామ్ చరణ్ తాజాగా ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఈవెంట్లో పాల్గొనడానికి రామ్ చరణ్ నిన్న ఉదయం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ చేరుకున్నాడు. మెల్బోర్న్ ఎయిర్ పోర్ట్ లో చాలా మంది చరణ్ ఫ్యాన్స్, అక్కడ ఉండే ఇండియన్స్ వచ్చి చరణ్ కి స్వాగతం పలికారు. అలాగే నేడు జరుగుతున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఈవెంట్ కి కూడా చాలా మంది అభిమానులతో పాటు ఇండియన్స్, ఆస్ట్రేలియా ప్రజలు కూడా చరణ్ ని చూడటానికి, చరణ్ తో ఫొటోలు దిగడానికి, చరణ్ కి షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి ఎగబడ్డారు. ఆస్ట్రేలియాలో చరణ్ కోసం ఈ రేంజ్ లో జనాలు రావడంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి.
Global star @AlwaysRamCharan dazzled at the Indian film festival of Melbourne and greeted the fans with humility ♥️✨️#IFFM2024 #GlobalStarRamCharan #RamCharan #RC #RC16 #RC17 #DrRamCharan #GameChanger pic.twitter.com/9IZGP7JFbU
— Beyond Media (@beyondmediapres) August 16, 2024
A MEGA welcome for Global Star ?
Global Star @AlwaysRamCharan was greeted with a resounding welcome by fans at Melbourne airport today. He is heading to attend @IFFMelb ?#GlobalStarRamCharan #RamCharan #GameChanger #RC16 #RC17 pic.twitter.com/PyXRPzHawQ
— Beyond Media (@beyondmediapres) August 15, 2024
ఇక రామ్ చరణ్ ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమా షూట్ పూర్తిచేశారు. ఈ సినిమా డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
Global Star @AlwaysRamCharan makes his dashing entry at the Indian film festival of Melbourne ??@IFFMelb #IFFM2024 #GlobalStarRamCharan #RamCharan #RC #RC16 #RC17 #DrRamCharan #GameChanger pic.twitter.com/FXiuMAsHtU
— Beyond Media (@beyondmediapres) August 16, 2024