‘గామి’ కలెక్షన్స్ జోరు మాములుగా లేదుగా.. రెండు రోజుల్లో..

'గామి' కలెక్షన్స్ జోరు మాములుగా లేదుగా. ఈ స్పీడ్ చూస్తుంటే మొదటి వీకెండ్ తోనే బ్రేక్ ఈవెన్ సాధించేలా కనిపిస్తుంది.

‘గామి’ కలెక్షన్స్ జోరు మాములుగా లేదుగా.. రెండు రోజుల్లో..

Vishwak Sen Chandini Chowdary Gaami Movie Second Day Collections Details

Updated On : March 10, 2024 / 1:21 PM IST

Gaami Collections : విశ్వక్ సేన్, చాందిని చౌదరి, అభినయ ప్రధాన పాత్రల్లో నటించిన ‘గామి’ సినిమా ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో దాదాపు ఆరేళ్ళ పాటు రూపొందిన ఈ చిత్రం.. టీజర్ అండ్ ట్రైలర్ తో మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా ట్రైలర్ లో కనిపించిన విజువల్స్.. ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ జోరు కనిపిస్తుంది.

మొదటి రోజే రూ.9.07 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని విశ్వక్ సేన్ హైయెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. అటు అమెరికాలో కూడా 250K డాలర్స్ పైగా కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. ఇక మొదటి రోజు సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం సెకండ్ డే కూడా అదే జోష్ ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తుంది. రెండో రోజు ఈ మూవీ రూ.6 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టి అదుర్స్ అనిపిస్తుంది.

Also read : Ritu Varma : మహారాణి రుక్మణీదేవిగా రీతు వర్మ.. ఫస్ట్ లుక్ అదిరింది..

మొత్తం మీద రెండురోజుల్లో ఈ చిత్రం.. రూ.15.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. అంటే దాదాపు 7 కోట్ల షేర్ ని రాబట్టినట్లే. కాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల పైనే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లు సమాచారం. దీనిబట్టి చూస్తే.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 22 కోట్ల గ్రాస్, 11 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కలెక్షన్స్ చూస్తుంటే.. ఈ మూవీ మొదటి వీకెండ్ తోనే బ్రేక్ ఈవెన్ సాధించేలా కనిపిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by V celluloid (@vcelluloidofficial)