Dhamki: యూఎస్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను విశ్వక్ సేన్ స్వయంగా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు విశ్వక్ సేన్ రెడీ అవుతున్నాడు. పూర్తి యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది.

Vishwak Sen Dhamki US Theatrical Rights Acquired By Noted Distributor
Dhamki: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను విశ్వక్ సేన్ స్వయంగా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు విశ్వక్ సేన్ రెడీ అవుతున్నాడు. పూర్తి యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది.
ఇక ఈ సినిమాను మార్చి 22న రిలీజ్‌కు రెడీ చేస్తోంది చిత్ర యూనిట్. కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా యూఎస్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ బ్యానర్ రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ మంచి క్రేజీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఈ బ్యానర్ వీరసింహారెడ్డి, సార్ వంటి పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను యూఎస్‌లో రిలీజ్ చేసి మంచి విజయాలను అందుకుంది. దీంతో ధమ్కీ సినిమాకు యూఎస్‌లో మంచి ఆదరణ దక్కడం ఖాయమని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ మరోసారి తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Dhamki: మాస్ కా దాస్ ‘ధమ్కీ’ ఇచ్చేందుకు ఇంకా చాలా టైమ్ ఉందా..?
ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన అందాల భామ నివేథా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోండగా, పాన్ ఇండియా మూవీగా ధమ్కీ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.
Happy to annouce that we acquired overseas theatrical rights of @VishwakSenActor #Dhamki #DasKaDhamki .overseas release by @Radhakrishnaen9 @Nivetha_Tweets @Ram_Miriyala @LyricsShyam @VanmayeCreation @VScinemas_ @saregamasouth pic.twitter.com/GyESyklGDO
— Radhakrishnaentertainments (@Radhakrishnaen9) February 28, 2023