Funky X Review: ఫంకీ మూవీ ఎక్స్ రివ్యూ.. విశ్వక్ హిట్ కొట్టాడా? అనుదీప్ సినిమా గురించి ఆడియన్స్ ఏమంటున్నారంటే?
అనుదీప్- విశ్వక్ సేన్ ఫంకీ మూవీ ఎక్స్ రివ్యూ(Funky X Review).
Vishwak sen funky movie review.
Funky X Review: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన రూట్ మార్చి చేసిన సినిమా ఫంకీ. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ తెరకెక్కించిన ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ లో కాయదు లోహర్ హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ తో ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఎట్టకేలకు ఈ సినిమా నేడు(ఫిబ్రవరి 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్స్ పడటంతో సినిమా చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో తమ రివ్యూ (Funky X Review)చెప్తున్నారు. మరి విశ్వక్ – అనుదీప్ కాంబోలో వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Sowmya Rao: వావ్.. జబర్దస్ యాంకర్ సౌమ్య రావ్.. టాప్ లెస్ గ్లామర్ ఫొటోస్ వైరల్
ఫంకీ సినిమా ఫుల్ ఆన్ ఫన్ రైడ్ అని అంటున్నారు. అనుదీప్ టైపు కామెడీ సినిమాలో చాలా బాగా వర్క్ అవుట్ అయ్యిందట. ఇక ఆయన స్టైల్ వన్ లైనర్స్ మాత్రం ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తాయని చెప్తున్నారు. ఇక విమల్ గా విశ్వక్ యాక్టింగ్ అదిరిపోయిందట. కామెడీ జానర్ లో తన మార్క్ చూపించాడట విశ్వక్. హీరోయిన్ కాయదు కూడా చాలా క్యూట్ గా గ్లామర్ గా కనిపిస్తూనే నవ్వులు పూయించిందట. ఓవరాల్ గా ఫంకీ సినిమా ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ అదిరిపోయింది అంటున్నారు.
కొంతమంది మాత్రం ఫంకీ సినిమాకు జస్ట్ యావరేజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయినా కథ మాత్రం అంతగా లేదని అంటున్నారు. ఓవరాల్ గా ఫంకీ సినిమా వన్ టైం వాచబుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి, కథ విషయం పక్కన పెడితే ఒక రెండు గంటల పాటు ఫుల్ ఎంటర్టైన్ అవడానికి మాత్రం ఫంకీ బెస్ట్ ఆప్షన్ అని, అనుదీప్ మరోసారి తన కామెడీ టైమింగ్ తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫంకీ సినిమా గురించి పూర్తి రివ్యూ రావాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
ST #Funky pic.twitter.com/9I6hGElPt9
— MAX 🐯🐉🦚 (@MaxVk18) February 13, 2026
Decent 1st half. Most of the comedy lands 👍 #Funky https://t.co/LKgbDD1ZXr
— RGK 🍀 (@iamrgk_) February 13, 2026
