Gangs of Godavari : గ్యాంగ్స్ అఫ్ గోదావరి ఫస్ట్ సింగల్ రిలీజ్.. సుట్టంలా సూసి పోకల..
విశ్వక్ సేన్, నేహా శెట్టి నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది. సుట్టంలా సూసి పోకల అంటూ..
Gangs of Godavari : విశ్వక్ సేన్ (Vishwaksen) ప్రస్తుతం వరుస సినిమాలను తెరకెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కృష్ణచైతన్య దర్శకత్వంలో తన 11వ సినిమాగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నాడు. నేహశెట్టి (Neha Shetty) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంటే, మరో భామ అంజలి (Anjali) ఒక ముఖ్య పాత్ర చేస్తుంది. ఇక ఒక పక్క సినిమా చిత్రీకరణ పూర్తి చేస్తూనే మరో పక్క ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తూ వస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇప్పటికే గ్లింప్స్ అండ్ పోస్టర్స్ ని రిలీజ్ చేస్తూ వచ్చారు.
Bedurulanka 2012 Trailer : రామ్ చరణ్ చేతులు మీదగా రిలీజైన బెదురులంక 2012 ట్రైలర్..
తాజాగా మూవీ నుంచి మొదటి సింగల్ ని రిలీజ్ చేశారు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్ కండక్ట్ చేసి ఈ సాంగ్ ని లాంచ్ చేశారు. హీరోహీరోయిన్లతో పాటు ఇతర చిత్ర యూనిట్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొంది. ‘సుట్టంలా సూసి పోకల’ అంటూ సాగే ఈ సాంగ్ లో విశ్వక్ అండ్ నేహా మధ్య ప్రేమ సన్నివేశాలను చూపిస్తూ తెరకెక్కించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిచగా శ్రీహర్ష ఇమాని లిరిక్స్, అనురాగ్ కులకర్ణి గానం అందించారు. సాంగ్ విజువల్స్ చాలా బాగున్నాయి.
Samantha : ‘చిన్మయి పాపా.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా..’ సమంత
శ్రీకర ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సగం హెయిర్ కట్ తో మెలితిప్పిన మీసాలతో రఫ్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్‌లో.. “మేము గోదారోళ్ళం, మాటొకటే సాగదీస్తాం. తేడా వస్తే మాత్రం నవ్వుతూ నరాలు తీసేస్తాం” అనే మాస్ డైలాగ్ సినిమా ఎలా ఉండబోతుందో ఆడియన్స్ కి తెలియజేశారు. పీరియాడిక్ పొలిటికల్ డ్రామాలా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.