Vishwak Sen: ఆ స్టార్ హీరోతో ధమ్కీ ఇప్పిస్తానంటోన్న విశ్వక్..?
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను విశ్వక్ సేన్ స్వయంగా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాలోని పాటలు, టీజర్, ట్రైలర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను రెట్టింపు చేశాయి.

Vishwak Sen Planning To Bring NTR For Dhamki Pre-Release Event
Vishwak Sen: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను విశ్వక్ సేన్ స్వయంగా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాలోని పాటలు, టీజర్, ట్రైలర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను రెట్టింపు చేశాయి.
Vishwak Sen : బాలకృష్ణ గారు నేను ఫ్రెండ్స్ అయ్యాం..
కాగా, గతంలో ‘ధమ్కీ’ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణను గెస్ట్‌గా పిలిచి సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యేలా చేశాడు విశ్వక్. ఇప్పుడు మళ్లీ తన సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు మరో స్టార్ హీరోను పట్టుకొచ్చే పనిలో ఉన్నాడట. ధమ్కీ చిత్రాన్ని మార్చి 22న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుండగా, ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్టుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను తీసుకొచ్చేందుకు విశ్వక్ సేన్ ప్రయత్నిస్తున్నాడట.
Vishwak Sen: విశ్వక్ సేన్ ధమ్కీ వచ్చేది ఇక అప్పుడేనా..?
మార్చి 17న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు విశ్వక్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఆస్కార్ అవార్డుల కోసం తారక్ అమెరికాలో ఉన్నాడు. ఆ ఈవెంట్ ముగియగానే హైదరాబాద్ తిరిగివచ్చాక, తన సినిమాను ప్రమోట్ చేసేందుకు రావాల్సిందిగా కోరాలని విశ్వక్ చూస్తున్నాడట. మరి ధమ్కీ ఇచ్చేందుకు తారక్ వస్తాడా లేడా అనేది చూడాలి.