Vishwak Sen : విశ్వక్‌సేన్ సంచలన ట్వీట్.. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు.. సినిమా రిలీజ్ అవ్వకపోతే ప్రమోషన్స్‌కి రాను..

విశ్వక్‌సేన్ త్వరలో గ్యాంగ్స్ అఫ్ గోదావరి(Gangs of Godavari) అనే సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమాని డిసెంబర్ 8న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

Vishwak Sen : విశ్వక్‌సేన్ సంచలన ట్వీట్.. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు.. సినిమా రిలీజ్ అవ్వకపోతే ప్రమోషన్స్‌కి రాను..

Vishwak Sen Sensational Tweet on Gangs of Godavari Movie Release Date Issue

Updated On : October 29, 2023 / 8:45 AM IST

Vishwak Sen : విశ్వక్‌సేన్ తక్కువ సినిమాలతోనే మంచి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల దాస్ కా ధ‌మ్కీ సినిమాతో హిట్ కొట్టి ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం మరో మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో గ్యాంగ్స్ అఫ్ గోదావరి(Gangs of Godavari) అనే సినిమాతో రాబోతున్నారు. విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వంలో అంజలి(Anjali), నేహశెట్టి(Neha Shetty) హీరోయిన్స్ గా సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా నుంచి గ్లింప్స్, ఒక సాంగ్ రిలీజ్ చేయగా మంచి రీచ్ వచ్చింది.

గోదావరి జిల్లాల్లో ఒక ఊరిలో జరిగే రాజకీయ గొడవలతో పీరియాడిక్ సినిమాగా గ్యాంగ్స్ అఫ్ గోదావరిని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్ 8న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే విశ్వక్ తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. విశ్వక్ తన ట్వీట్ లో.. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు మన గేమ్ మారుద్దాం అనుకుంటాడు. నేను సినిమా చూడకుండా ప్రతి ఫ్రేమ్ ప్రాణం పెట్టి పని చేసి చెప్తున్నా. డిసెంబర్ 8 వస్తున్నాం. హిట్, ప్లాప్, సూపర్ హిట్, అట్టర్ ఫ్లాప్ అది మీ డెసిషన్. ఆవేశానికో, ఈగోకు తీసుకున్న డెసిషన్ కాదు. తగ్గేకొద్దీ మింగుతారని అర్థమైంది. డిసెంబర్ 8 శివాలెత్తిపోద్ది. గంగమ్మ తల్లికి నా ఒట్టు. మహాకాళి నాతో ఉంది. డిసెంబర్ లో సినిమా రిలీజవ్వకపోతే నన్ను ప్రమోషన్స్ లో చూడరు అని ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

అదే డేట్ కి హాయ్ నాన్న, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, ఆపరేషన్ వ్యాలెంటైన్ సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి. అందుకోసమే సేఫ్ సైడ్, రిస్క్ చేయడం ఎందుకు అనుకోని నిర్మాత రిలిజ్ డేట్ మారుద్దాం అనుకున్నట్టు, దానికి విశ్వక్ ఒప్పుకోలేదని, అందుకే ఇలా ట్వీట్ చేసాడని సమాచారం.

Also Read : Japan Trailer : కార్తీ జపాన్ ట్రైలర్ చూశారా? బంగారం దొంగగా ఈసారి మరింత క్రొత్తగా ట్రై చేస్తున్న కార్తీ..

అయితే పలువురు నెటిజన్లు.. సినిమా పోతే బాధపడేది నిర్మాత, ఎప్పుడు రిలీజ్ చేయాలో నిర్మాతకు తెలుసు నీకెందుకు, ఆవేశంతో ఇలా మాట్లాడి నిన్ను నువ్వే నెగిటివ్ చేసుకుంటున్నావు, నీకు మూవీ మీద నమ్మకం ఉంటే ముందే రిలీజ్ చేయి, తాగి ట్వీట్ చేశావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విషయం చెప్పడం తప్పు కాదేమో కానీ ఇలాంటి వ్యాఖ్యలతో ట్వీట్ చేయడం తప్పు అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా డిసెంబర్ 8న రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.