Gangs Of Godavari : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. విశ్వక్‌సేన్ సర్‌ప్రైజ్ మాములుగా లేదుగా.. ఈ సారి పీరియాడిక్ మాస్..
విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో VS11 వర్కింగ్ టైటిల్‌తో అంజలి, నేహశెట్టి హీరోయిన్స్ గా సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా నుంచి విశ్వక్‌సేన్, అంజలి ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసి పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామా అని చెప్పేశారు. తాజాగా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు.

VishwakSen 11th movie titled as Gangs Of Godavari and Glimpse Released
VishwakSen : విశ్వక్సేన్ తక్కువ సినిమాలతోనే మంచి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల దాస్ కా ధమ్కీ సినిమాతో హిట్ కొట్టి ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం మరో మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా తన 11వ సినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు విశ్వక్సేన్.
విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో VS11 వర్కింగ్ టైటిల్‌తో అంజలి, నేహశెట్టి హీరోయిన్స్ గా సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా నుంచి విశ్వక్‌సేన్, అంజలి ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసి పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామా అని చెప్పేశారు. తాజాగా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు గ్యాంగ్స్ అఫ్ గోదావరి అని టైటిల్ పెట్టారు. గోదావరి జిలాల్లో జరిగే మాస్ యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది.
Chandramukhi 2 : చంద్రముఖి 2 నుంచి రాజు వచ్చేశాడు.. రిలీజ్ ఆ పండగకే..
గ్లింప్స్ లో.. మేము గోదారోళ్ళం.. మాటొకటే సాగదీస్తాం, తేడా వస్తే.. నవ్వుతూ నరాలు తీసేస్తాం అంటూ విశ్వక్‌సేన్ మాస్ డైలాగ్ తో మొదలుపెట్టాడు. గ్లింప్స్ చూస్తుంటే ఒక ఊళ్ళో జరిగే పొలిటికల్ డ్రామాలా అనిపిస్తుంది ఈ సినిమా. సడెన్ గా గోదావరిపై సినిమా, అది కూడా ఇలా మస్ యాక్షన్ లో తెలంగాణ కుర్రోడు అయిన విశ్వక్ ప్రకటించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ సినిమాని శ్రీకర ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి.