Vivek Ranjan Agnihotri : మీ సినిమాలని బాయ్ కాట్ చేస్తే నష్టమా.. చిన్న సినిమాలని మీరు అడ్డుకున్నప్పుడు.. బాలీవు డాన్ లకు కౌంటర్..
బాలీవుడ్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వివేక్ మాట్లాడుతూ.. ''చిన్న సినిమాలను, కంటెంట్ ఉన్న సినిమాలను బాలీవుడ్ డాన్లుగా పేరు పొందిన కొంతమంది వ్యక్తులు గతంలో ఆపినప్పుడు, ఆ చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా అడ్డుకున్నపుడు.............

Vivek Ranjan Agnihotri comments on boycott bollywood trend
Vivek Ranjan Agnihotri : ఇటీవల బాలీవుడ్ లో పెద్ద సినిమాలన్నిటిని బాయ్ కాట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో అమీర్ ఖాన్ దేశంపై చేసిన వ్యతిరేక వ్యాఖ్యలకు గాను ఇటీవల రిలీజ్ అయిన అతని లాల్ సింగ్ చడ్డా సినిమాని బాయ్ కాట్ చేశారు. అమీర్ కి సపోర్ట్ గా నిలిచినందుకు హృతిక్ సినిమాని కూడా బాయ్ కాట్ చేస్తున్నారు. కొంతమంది ఏకంగా బాయ్ కాట్ బాలీవుడ్ అని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ బాలీవుడ్ సినిమాలని బాయ్ కాట్ చేసే ట్రెండ్ పై పలువురు బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్జున్ కపూర్ లాంటి హీరో అయితే ఈ బాయ్ కాట్ అనేవాళ్లపై చర్యలు తీసుకోవాలి అని సీరియస్ కామెంట్స్ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
తాజాగా ఈ వివాదంపై కశ్మీర్ ఫైల్స్ సినిమా డైరెక్టర్ వివేక్ రంజాన్ అగ్నిహోత్రి స్పందించారు. ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వివేక్ మాట్లాడుతూ.. ”చిన్న సినిమాలను, కంటెంట్ ఉన్న సినిమాలను బాలీవుడ్ డాన్లుగా పేరు పొందిన కొంతమంది వ్యక్తులు గతంలో ఆపినప్పుడు, ఆ చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా అడ్డుకున్నపుడు మీరెందుకు స్పందించలేదు. అప్పుడు కూడా ఎంతోమంది ప్రతిభ కలిగిన నటులు, రచయితలు, టెక్నీషియన్స్ జీవితాలు నాశనమయ్యాయి కదా. నా కశ్మీర్ ఫైల్స్ సినిమాకి కూడా మొదట థియేటర్లు ఇవ్వలేదు. నా సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో, బాలీవుడ్ పెద్ద హీరోల సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో నాకు థియేటర్స్ దొరికాయి. మీ సినిమాలను బాయ్ కాట్ చేస్తే నష్టమా? మీరు చిన్న సినిమాలని ఆపినప్పుడు నష్టం రాదా” అని ప్రశ్నించారు.
Namitha : కవలలకు జన్మనిచ్చిన నమిత.. కృష్ణాష్టమి రోజు స్పెషల్ న్యూస్ అనౌన్స్..
అంతే కాక బాలీవుడ్ డాన్ల దురహంకారం, ఫాసిజం, హిందూ ఫోబియా గురించి భారతీయులకు తెలిసినప్పుడు వాళ్ళని వేడి వేడి కాఫీలో ముంచేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు డైరెక్టర్ వివేక్.