VJ Sunny – Sound Party : సినీ జ‌ర్న‌లిస్టుల చేతుల మీదుగా.. విజె సన్నీ కొత్త మూవీ టైటిల్ లోగో లాంచ్‌..

బిగ్ బాస్ ఫేమ్ విజె సన్నీ తన కొత్త మూవీ టైటిల్ ని అనౌన్స్ చేశాడు. సినీ జ‌ర్న‌లిస్టుల చేతుల మీదుగా ఈ మూవీ టైటిల్ లోగోని..

VJ Sunny – Sound Party : సినీ జ‌ర్న‌లిస్టుల చేతుల మీదుగా.. విజె సన్నీ కొత్త మూవీ టైటిల్ లోగో లాంచ్‌..

VJ Sunny new movie Sound Party titled logo released by movie journalists

Updated On : June 28, 2023 / 7:25 PM IST

VJ Sunny – Sound Party : ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై తొలి ప్ర‌య‌త్నంగా బిగ్ బాస్ – 5 టైటిల్ విన్నర్ విజె సన్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా నటిస్తున్న నూతన చిత్రం ‘సౌండ్ పార్టీ’. దర్శకుడు జయశంకర్ సమర్పణలో టాలెంటెడ్ రైటర్ ‘సంజయ్ శేరి’ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రం నేటితో షూటింగ్ విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా సార‌థి స్టూడియోలో ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో పోస్ట‌ర్ ను జ‌ర్న‌లిస్ట్ ల చేతుల మీదుగా ఆవిష్క‌రించారు.

Yadamma Raju : ఏడాది కాకముందే కమెడియన్ జంట విడాకులు.. ఏమైందో చెప్పిన యాదమ్మ రాజు!

జ‌ర్న‌లిస్ట్ గా మొద‌లైన స‌న్ని కెరీర్ దిన‌దినాభివృద్ధి చెందుతూ ముందుకెళుతోందని, ఈ సినిమాతో త‌ను సిల్వ‌ర్ స్క్రీన్ పై మ‌రింత సౌండ్ చేయాల‌ని కోరుకుంటున్నట్లు జ‌ర్న‌లిస్టులు తమ ఆశాభావం వ్యక్తం చేస్తూ మూవీ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా నిన్న (జూన్ 27) ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సన్నీ.. పార్టీ పెట్ట‌బోతున్నా అంటూ రిలీజ్ చేసిన వీడియో బాగా వైరల్ అయ్యింది. అయితే అది సౌండ్ పార్టీ అని నేడు తెలిసింది. ఈ సినిమాలో 30 ఇయ‌ర్స్ పృథ్వీ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

Vijay Antony Hatya Movie : జూలై 21న విజయ్ ఆంటోనీ ‘హత్య’

ఈ చిత్ర షూటింగ్ ని కేవలం 25 రోజుల్లోనే పూర్తి చేసినట్లు నిర్మాత ర‌వి పోలిశెట్టి తెలియజేశారు. ముందుగా అనుకున్నట్లే ఈ సినిమాని ఆగష్టులో రిలీజ్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఈ సినిమాకి మోహిత్ రెహ‌మానిక్ సంగీతం అందిస్తున్నాడు. కాగా సౌండ్ పార్టీ టైటిల్ మంచి క్యాచీగా ఉంది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్ తో దూసుకుపోతున్న సన్నీ.. ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని అందుకున్నాడో చూడాలి.