Waltair Veerayya : ఓటిటిలో వింటేజ్ చిరు సందడి షురూ.. వాల్తేరు వీరయ్య!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్స్ అండ్ యాక్షన్ కామెడీతో ప్రేక్షకులను అలరించిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి బరిలో బాక్స్ ఆఫీస్ వద్ద పూనకాలు తెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో సందడి చేయడానికి సిద్దమవుతుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ ప్రసారం కానుంది. ఫిబ్రవరి..

Waltair Veerayya ott
Waltair Veerayya : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్స్ అండ్ యాక్షన్ కామెడీతో ప్రేక్షకులను అలరించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. చిరుని వింటేజ్ వెర్షన్ లో చూపించడంలో దర్శకుడు బాబీ సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. రీ ఎంట్రీ తరువాత చిరంజీవి నుంచి మిస్ అవుతున్న కామెడీ టైమింగ్ ని ఈ సినిమాలో చూపించడంతో జనరల్ ఆడియన్స్ కూడా థియేటర్లకు ఎగపడేలా చేసింది. ఇప్పటి హీరోలు 100 కోట్లు అందుకోవడానికి నానా తిప్పలు పడుతుంటే, చిరు ఈ సినిమాతో దాదాపు రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి తన స్టామినా ఏంటో మరోసారి చూపించాడు.
Chiranjeevi : ఆ హీరోయిన్లు పట్టించుకోని సినిమాటోగ్రాఫర్‌కి.. ఆపద్బాంధవుడు ఆర్ధిక సాయం!
ఇక ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరో మాస్ మహారాజ్ రవితేజ కూడా నటించాడు. చిరంజీవికి తమ్ముడిగా రవితేజ ఈ సినిమాలో కనిపించాడు. వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ ని కంటతడి పెట్టించాయి. సంక్రాంతి బరిలో బాక్స్ ఆఫీస్ వద్ద పూనకాలు తెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో సందడి చేయడానికి సిద్దమవుతుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ ప్రసారం కానుంది. ఫిబ్రవరి 27న నుంచి ఈ మూవీ ఓటిటిలో అందుబాటులోకి రాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
కాబట్టి వింటేజ్ చిరుని ఎవరైనా థియేటర్ లో మిస్ అయ్యి ఉంటే, ఓటిటిలో చూసి ఎంజాయ్ చేయండి. చిరు మునపటి మూవీ గాడ్‌ఫాదర్ కూడా నెట్‌ఫ్లిక్స్ లోనే రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన వారం రోజులు పాటు నెంబర్ వన్ పొజిషన్ లో నిలిచి, RRR తరువాత మూవీగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ ఎటువంటి రికార్డు క్రియేట్ చేస్తాడో చూడాలి. కాగా చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ సినిమాలో నటిస్తున్నాడు. తమిళ సినిమా ‘వేదాళం’కి ఇది రీమేక్ గా వస్తుంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సమ్మర్ లేదా దసరాకి రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, కీర్తిసురేష్ చిరుకి చెల్లిగా నటిస్తుంది.
In front there is Mega Force festival! Waltair Veerayya is coming to Netflix on 27th Feb and we can't keep calm??? pic.twitter.com/MD0FDSREtB
— Netflix India South (@Netflix_INSouth) February 7, 2023