Waltair Veerayya : “చిరంజీవి-శ్రీదేవి” వచ్చేశారు.. వాల్తేరు వీరయ్య సెకండ్ సింగల్ రిలీజ్..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పక్కా మాస్ కమర్షియల్ ఎలెమెంట్స్ తో వస్తుంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 'బాస్ పార్టీ' ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీలోని సెకండ్ సింగల్ లోనో కొంత బిట్‌ని ఇటీవల చిరంజీవి లీక్ చేయగా, నేడు మేకర్స్ ఫుల్ సాంగ్ ని విడుదల చేశారు.

Waltair Veerayya second single out now
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పక్కా మాస్ కమర్షియల్ ఎలెమెంట్స్ తో వస్తుంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘బాస్ పార్టీ’ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీలోని సెకండ్ సింగల్ లోనో కొంత బిట్‌ని ఇటీవల చిరంజీవి లీక్ చేయగా, నేడు మేకర్స్ ఫుల్ సాంగ్ ని విడుదల చేశారు.
Waltair Veerayya: వీరసింహారెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య.. తగ్గేదే లే అంటోన్న సీనియర్స్!
“నువ్వు సీతవైతే నేను రాముడినంటా, నువ్వు రాధావైతే నేను కృషుడినంటా” అంటూ మొదలైన పాట.. మనం నిత్యం మాట్లాడే మాటలని పాటగా మారుస్తూ, ‘నువ్వు శ్రీదేవి అయితే నేనే చిరంజీవి అంటా’ అనే క్యాచీ లిరిక్స్ ముగించాడు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటని జస్ప్రీత్ జాస్జ్, సమీరా భరద్వాజ్ ఆలపించారు. ఇక శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులకి చిరంజీవి గ్రేస్ యాడ్ చేసి అదరగొట్టేశాడు.
ఫ్రాన్స్ లోని అందమైన లొకేషన్స్‌ని.. ఆర్థర్ ఏ విల్సన్ చాలా చక్కగా చిత్రీకరించాడు. చిరంజీవి కూడా శృతిహాసన్ పక్కన చాలా యంగ్ గా కనపడ్డాడు. ఈ పాట కూడా మరో బ్లాక్ బస్టర్ కాబోతుంది అనడంలో సందేహం లేదు. కాగా ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీస్ రోల్ లో కనిపించబోతున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.