కళ్యాణ్‌ దేవ్‌తో కన్నడ బ్యూటీ

‘సూపర్ మచ్చి’ సినిమాలో క‌ల్యాణ్‌దేవ్ స‌ర‌స‌న క‌న్న‌డ బ్యూటీ రచితా రామ్ కథానాయికగా నటిస్తోంది..

  • Published By: sekhar ,Published On : November 16, 2019 / 05:40 AM IST
కళ్యాణ్‌ దేవ్‌తో కన్నడ బ్యూటీ

‘సూపర్ మచ్చి’ సినిమాలో క‌ల్యాణ్‌దేవ్ స‌ర‌స‌న క‌న్న‌డ బ్యూటీ రచితా రామ్ కథానాయికగా నటిస్తోంది..

మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు.. ‘విజేత’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న రెండో సినిమా.. ‘సూపర్ మచ్చి’.. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, పులి వాసుని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. రిజ్వాన్ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్‌ రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది.

Read Also : ‘ఈ ముల్లేదో 20 ఏళ్ల క్రితమే గుచ్చుకుని ఉంటే’ – వెంకీమామ రెట్రో సాంగ్..

ఈ చిత్రంలో క‌ల్యాణ్‌దేవ్ స‌ర‌స‌న క‌న్న‌డ బ్యూటీ, కన్నడలో స్టార్ హీరోలతో నటించి గుర్తింపు తెచ్చుకున్న ర‌చితా రామ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. న‌వంబ‌ర్ 22 నుండి కొత్త షెడ్యూల్‌ ప్రారంభించ‌బోతున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్.ఎస్‌.థమ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: పులి వాసు
నిర్మాత‌: రిజ్వాన్‌
కో-ప్రొడ్యూస‌ర్‌: ఖుషి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: మ‌నోజ్ మావెళ్ల‌
మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.థమ‌న్
కెమెరా: శ్యామ్ కె.నాయుడు
ఎడిటింగ్‌: మార్తాండ్ కె.వెంక‌టేశ్‌
ఆర్ట్‌: బ్ర‌హ్మ క‌డ‌లి
పాట‌లు: కెకె