Tollywood Movies : నిన్న విజయశాంతి, మొన్న నాగవంశీ.. అసలు సినిమాలను ఎవరు తొక్కేస్తున్నారు? వీళ్ళు అంటున్నది ఎవర్ని?

ఇటీవల కొంతమంది సినీ ప్రముఖులు తమ సినిమాని తొక్కేస్తున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు.

Who Do More Negativity to Tollywood Movies Celebrities Fires on Reviewers

Tollywood Movies : ఇటీవల కొంతమంది సినీ ప్రముఖులు తమ సినిమాని తొక్కేస్తున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం నాగవంశీ కొంతమంది మీడియా వాళ్ళు సినిమా బాగున్నా, హిట్ అయినా నెగిటివ్ గా రాస్తున్నారు. హిట్ అయితే ఎందుకు హిట్ అయింది అని రాస్తున్నారు అంటూ ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన సినిమాలకు ఎవరూ రావట్లేదు, థియేటర్స్ లో సినిమాలు క్యాన్సిల్ చేస్తున్నారు అంటూ వాపోయాడు. రీసెంట్ గా నిన్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా సక్సెస్ మీట్ లో విజయశాంతి.. కొంతమంది కావాలని సినిమాని నెగిటివ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రచారం చేస్తే బాగోదు. ఇలాంటివి మానుకోండి అంటూ ఏకంగా వార్నింగ్ ఇచ్చారు. గతంలో కూడా కొంతమంది సినిమా సెలబ్రిటీలు రివ్యూయర్స్ సినిమాని నెగిటివ్ చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు. దీంతో అసలు సినిమాలను ఎవరు నెగిటివ్ చేస్తున్నారు, సినిమాలు ఎందుకు నష్టపోతున్నాయి అని టాలీవుడ్ లో చర్చగా మారింది.

ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులు ఫైర్ అయ్యేది రివ్యూయర్స్ మీదే అని పలువురు భావిస్తున్నారు. యూట్యూబ్ లో ఒక ఐదారుగురు సినిమా రివ్యూలు చెప్తూ బాగా పాపులర్ అయ్యారు. అయితే వీళ్ళు సినిమా రివ్యూ సినిమాలా చెప్పకుండా దాన్ని పోస్ట్ మార్టం చేసినట్టు చీల్చి చెండాడి చెప్తున్నారు. అయితే ఇది కేవలం వాళ్ళ ఒపీనియన్ అయినా ప్రేక్షకుల మీద సినిమా ఇంతే అన్నట్టు రుద్దుతున్నారు. ముఖ్యంగా ఓ నలుగురు యూట్యూబ్ లో రివ్యూలు ఇచ్చేవాళ్లపై టాలీవుడ్ అంతా ఫైర్ అవుతుంది. పలువురు ఫ్యాన్స్, సినిమా లవర్స్ కూడా ఆ నలుగురిని సోషల్ మీడియాలో తిడుతూనే ఉంటారు. ముఖ్యంగా వెబ్ సైట్స్ కంటే యూట్యూబ్ లోనే రీచ్ ఎక్కువ ఉంటుంది. అలా యూట్యూబ్ లో రివ్యూలు చెప్పేవాళ్లకు లక్షల్లో భారీగా వ్యూస్ వస్తున్నాయి. దీంతో అది సినిమాలకు ఎఫెక్ట్ అవుతుందని సినిమా సెలబ్రిటీలు అంటున్నారు.

Also Read : Sampoornesh Babu : ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరూ వాళ్ళ అన్నదమ్ములకు ఫోన్ చేస్తారు.. ‘సోదరా’ అంటూ వస్తున్న సంపూర్ణేష్ బాబు, సంజోష్..

ఇక కొంతమంది ప్రముఖులు వెబ్ సైట్స్ వల్ల అని కూడా అంటున్నారు. ఇటీవల నాగవంశీ ఓ వెబ్ సైట్ పేరు చెప్పకుండా ఆ వెబ్ సైట్ ని విమర్శించారు. సినీ పరిశ్రమలో చాలా మంది ఒకటి లేదా రెండు మూడు వెబ్ సైట్స్ నే విమర్శిస్తారు. ఎందుకంటే ఆ రెండు మూడు సైట్లే సినిమాల గురించి తీవ్రంగా నెగిటివ్ చేసి రాస్తారు. అందుకని ఆ వెబ్ సైట్స్ పేర్లు మెన్షన్ చేయకుండా పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే కొన్ని సైట్స్ సినిమాని తొక్కేస్తున్నాయంటూ విమర్శించారు. అయితే వెబ్ సైట్ రీచ్ యూట్యూబ్ తో పోలిస్తే తక్కువే కాబట్టి మిగిలిన వెబ్ సైట్స్ వాళ్ళు మాత్రం వెబ్ సైట్స్ వల్ల నెగిటివిటి అవ్వట్లేదు. మేము బాగున్న సినిమాలని పొగుడుతున్నాం, చిన్న సినిమా హిట్ అయినా అభినందిస్తున్నాము వాటి గురించి మాట్లాడారెందుకు అని ప్రశ్నిస్తున్నారు.

ఇక ఫ్యాన్స్ వార్స్ కూడా సినిమాలకు చాలా నెగిటివిటి తెస్తున్నాయి. బెస్ట్ ఉదాహరణ గేమ్ ఛేంజర్ సినిమా. గేమ్ ఛేంజర్ సినిమాకు రిలీజ్ కి ముందు నుంచి ఓ ఇద్దరు హీరోల అభిమానులు తీవ్ర వ్యతిరేకత తెచ్చారు. సోషల్ మీడియాలో సినిమా ఫ్లాప్ అంటూ విస్తృతంగా ప్రచారం చేసారు. ఏకంగా సైబర్ పోలీసుల వరకు ఈ గొడవ వెళ్లి ఓ హీరో ఫ్యాన్స్ ని పట్టుకున్నారు కూడా. కేవలం తమ హీరో మాత్రమే గ్రేట్, తమ హీరోల సినిమాలే ఆడాలని కొంతమంది అభిమానులు విచక్షణ జ్ఞానం లేకుండా వేరే హీరోల సినిమాలకు నెగిటివిటి చేస్తున్నారు. ఇందులో కొంతమంది అయితే సినిమా కూడా చూడకుండా నెగిటివ్ చేస్తున్నారు. అయితే ఈ ఫ్యాన్స్ వార్స్ వల్ల ముఖ్యంగా పెద్ద సినిమాలకే తలనొప్పి. సినిమాలు సక్సెస్ అవ్వకపోవడానికి ఫ్యాన్ వార్స్ కూడా ముఖ్య కారణం. ఒక హీరో అభిమానులు ఇంకో హీరో సినిమాని తొక్కేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. హీరోలు రెగ్యులర్ గా కలిసి కనిపించడం, మాట్లాడటం, ఒకరి ఈవెంట్ కి ఇంకొకరు రావడం లాంటివి చేస్తే ఈ ఫ్యాన్ వార్స్ ని కాస్త తగ్గించొచ్చు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Also Read : Tejaswini Gowda : భర్త వెళ్ళొచ్చాడు.. ఇప్పుడు భార్య కూడా..? ఆల్రెడీ ఆఫర్ వచ్చినా.. బిగ్ బాస్ కి వెళ్లడంపై తేజస్విని గౌడ కామెంట్స్..

ఇంకొకటి సోషల్ మీడియా. చాలా మంది సినిమా చూస్తూనే సోషల్ మీడియాలో ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది, ఇంటర్వెల్ అలా ఉంది, సెకండ్ హాఫ్ ఇలా ఉంది, క్లైమాక్స్ అలా.. అంటూ లైవ్ కామెంట్రీ ఇస్తున్నారు. ఇది కూడా సినిమా చూడాలి అనే ఆసక్తిని తగ్గిస్తుంది. సినిమాలో వచ్చే మెయిన్ ఘట్టాలు, ఎలివేషన్ సీన్స్ అన్ని వీడియోలతో సహా సోషల్ మీడియాలో కొంతమంది ఆపుకోలేక పోస్ట్ చేసేస్తుంటే ఇంకా సినిమా మీద ఇంట్రెస్ట్ ఏమొస్తుంది. కొంతమంది అయితే సినిమాల్లో ఉండే ట్విస్టులు కూడా రివీల్ చేస్తుండటంతో సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సోషల్ మీడియాను మాత్రం ఆపడం కష్టమే. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్, అందులో సోషల్ మీడియా అకౌంట్ ఉంటుంది కాబట్టి సోషల్ మీడియాలో సినిమా గురించి రాసేవాళ్ళని మాత్రం ఆపలేం.

మరొకటి సినిమాలను సినిమా వాళ్లే తొక్కేసుకుంటున్నారు. అవును ఇది నిజమే అని జనాలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇందులో ముఖ్యంగా టికెట్ రేట్లు ఒకటి కారణం. స్టార్ హీరోలు, భారీ సినిమాలకు టికెట్ రేట్లు పెంచితే సర్లే అనుకోవచ్చు. ఇటీవల చిన్న సినిమాలకు, మీడియం సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచారు. ఇటీవల అసలు హైప్ లేని ఓ మీడియం సినిమాకు 50 రూపాయలు టికెట్ రేట్లు పెంచారు. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడానికి టికెట్ రేట్ల పెంపు కూడా ఒక కారణమే. ఓ నెల రోజుల్లో ఓటీటీకి వచ్చే సినిమాకు ఎక్కువ డబ్బులు పెట్టుకొని సినిమాకు వెళ్లాలా అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. టికెట్ రేట్లపై నిర్మాతలు ఆలోంచించకపోతే వాళ్ళ సినిమాలకే ముప్పు తప్పదు.

Also Read : Anchor Rashmi : సర్జరీ చేయించుకున్న ‘యాంకర్ రష్మీ’.. జనవరి నుంచి బాధపడుతూ.. హాస్పిటల్ నుంచి ఫోటో షేర్ చేసి..

ఇక మరొకటి ఓటీటీ. ఓటీటీ వాళ్ళు సినిమా వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారని చాలా మంది సినీ పరిశ్రమ వ్యక్తులు బహిరంగంగానే చెప్తున్నారు. రిలీజయిన నెల రోజుల్లోనే భారీ సినిమాలు సైతం ఓటీటీకి వచ్చేయడం, అది ఏ ఓటీటీకి వచ్చేస్తుందో ముందే సినిమాలో చెప్పేయడంతో ఫలానా ఓటీటీలోకి నెల రోజుల్లో వచ్చే సినిమాకు మళ్ళీ థియేటర్ కి వెళ్లడం అవసరమా అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఓటీటీలను కంట్రోల్ చేయకపోతే థియేటర్ వ్యవస్థ కష్టమే అని ఇటీవల ఓ స్టార్ డైరెక్టర్ కూడా మీడియా ముందు మాట్లాడారు.

సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి అందులో కథా బలం లేకపోవడం, సినిమాలో అసలు కంటెంట్ లేకపోవడం మెయిన్ కారణం. ఇవన్నీ దానికి జత చేరే చిన్న కారణాలు మాత్రమే. నిర్మాతలు, హీరోలు కంటెంట్ అనేది ముఖ్యం అని నమ్మితే సినిమా బాగుంటే ఎవరు ఎంత నెగిటివ్ గా చెప్పినా ఆ సినిమా ఆడుద్ది. అందుకు ఉదాహరణ ఇటీవల వచ్చిన కోర్ట్ సినిమానే. చిన్న సినిమా, స్టార్స్ లేరు, కొంతమంది విమర్శించారు కూడా అయినా కంటెంట్ బాగుండటంతో ప్రేక్షకులు, మీడియా కూడా సినిమాని ఆకాశానికెత్తేసారు. తమిళ సినిమా మహారాజా కూడా ఒక ఉదాహరణ. తమిళ సినిమా అయినా సినిమా చాలా బాగుండటంతో అందరూ పొగిడారు. దానిమీద మీడియా స్పెషల్ ఆర్టికల్స్ కూడా రాశారు.

Also Read : Siree Lella : హ్యాపీ బర్త్ డే పెద మామయ్య.. చంద్రబాబుకు స్పెషల్ విషెష్ చెప్పిన హీరోయిన్.. ఫోటో వైరల్..

ఎవరైతే నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు అంటున్నారో వాళ్ళే ఇలాంటి మంచి సినిమాలకు పాజిటివ్ రివ్యూలు ఇచ్చి పొగిడారు కూడా. సినీ ప్రముఖులు ఈ విషయాన్ని గ్రహించి సినిమా కంటెంట్ బాగుంటే ఎవరూ విమర్శించలేరు అని తెలుసుకుంటే బాగుంటుందని రివ్యూలు ఇచ్చేవాళ్ళు అంటున్నారు. ఒక్క ఫ్యాన్ వార్స్ మాత్రం కంట్రోల్ చేయడం కష్టమే. అది వాళ్ళంతట వాళ్ళు మారాలి. లేదా హీరోలే స్వయంగా రంగంలోకి దిగాలి. లేదంటే పెద్ద సినిమాలకు ఫ్యాన్స్ వార్స్ వల్ల సినిమాలకు నష్టం తప్పదు. మరి సినిమాలను తొక్కేస్తున్నారు అని స్టేజిల మీద వాపోయేవాళ్లు టాలీవుడ్ పెద్దలతో మీటింగ్స్ పెట్టి ఇలాంటివన్నీ చర్చించి దానికి తగ్గట్టు ఏమైనా చర్యలు తీసుకుంటారా చూడాలి.