Sampoornesh Babu : ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరూ వాళ్ళ అన్నదమ్ములకు ఫోన్ చేస్తారు.. ‘సోదరా’ అంటూ వస్తున్న సంపూర్ణేష్ బాబు, సంజోష్..

ప్రమోషన్స్ లో భాగంగా నేడు సంపూర్ణేష్ బాబు, సంజోష్ మీడియాతో మాట్లాడారు.

Sampoornesh Babu : ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరూ వాళ్ళ అన్నదమ్ములకు ఫోన్ చేస్తారు.. ‘సోదరా’ అంటూ వస్తున్న సంపూర్ణేష్ బాబు, సంజోష్..

Sampoornesh Babu and Sanjosh about Sodara Movie

Updated On : April 20, 2025 / 6:09 PM IST

Sampoornesh Babu : సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా సోదరా. క్యాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై చంద్ర చగంలా నిర్మాణంలో మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్‌ 25న థియేటర్స్‌ లో విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా నేడు సంపూర్ణేష్ బాబు, సంజోష్ మీడియాతో మాట్లాడారు.

సంపూర్ణేష్‌ బాబు మాట్లాడుతూ.. సోదరా సినిమా నా అంతకుముందు సినిమాల్లాగా ఉండదు. ఇది ఇద్దరు అన్నదమ్ముల కథ. అన్నగా బరువు బాధ్యతలు ఉన్న పాత్ర పోషించాను. నా రియల్‌ లైఫ్‌లో ఉండే నరసింహా చారికి ఈ సినిమాలో పాత్ర దగ్గరిగా ఉంటుంది. నా రెగ్యులర్ పాత్రలకు భిన్నంగా ఈ పాత్ర పోషించడానికి షూటింగ్ లో మొదటి మూడు నాలుగు రోజులు ఇబ్బంది పడ్డాను. దాంతో నాకు వేరే సినిమా షూటింగ్‌లు ఉన్నా ఈ క్యారెక్టర్‌లోని మూడ్‌ పోకూడదని ఈ సినిమాలో నా పాత్ర కంప్లీట్‌ అయ్యేదాకా వేరే షూటింగ్స్ చేయలేదు. సినిమా చూసిన తరువాత ప్రతి ఒక్కరూ తమ అన్నదమ్ములకు ఫోన్‌ చేస్తారు. అందరూ హృదయ కాలేయం లాంటి సినిమాలు మళ్లీ నా నుంచి ఎందుకు రావడం లేదు అని అడుగుతున్నారు. ఆ స్థాయికి తగ్గ కథలు దొరకడం లేదు. ప్రస్తుతం ఈ సినిమాతో పాటు ఇంకో రెండు సినిమాల్లో నటిస్తున్నాను. సూపర్‌ సుబ్బు అనే నెట్ ఫ్లిక్స్ వెబ్‌సీరిస్‌లో కూడా నటించాను అని తెలిపారు.

Also See : Suriya – Jyotika : ఆలయాలు సందర్శించిన స్టార్ కపుల్ సూర్య – జ్యోతిక.. ఫొటోలు వైరల్..

సంజోష్‌ మాట్లాడుతూ.. ఇంతకు ముందు నేను బేవర్స్ అనే సినిమాలో హీరోగా నటించాను. సంపూతో కలిసి ఓ బ్రదర్‌గా ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. అన్నదమ్ముల అనుబంధాన్ని తెలిపే కథ ఇది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి దర్శకుడు ఈ సినిమాకు బ్రోమాంటిక్‌ అని ట్యాగ్ పెట్టాడు. ఇది అమాయకుడైన అన్న, అప్‌డేట్ అయిన తమ్ముడి కథ. అన్నదమ్ములు కలిసి ఉండాలి అని కోరుకునే కథ ఇది. నాకు ఇంతకుముందే సంపూతో పరిచయం ఉన్నది. ఈ పాత్రకు సంపూ సరిపోతాడని ఆయన చేస్తే సర్‌ప్రైజ్‌గా ఉంటుందని అనుకున్నాం. ఈ రోజుల్లో అన్నదమ్ముల మధ్య అనుబంధం కరువైపోయింది. ఈ సినిమా చూసిన తరువాత ఒకరిద్దరూ మారినా మాకు సంతోషమే. త్వరలోనే నేను సోలో హీరోగా రియల్‌ ఇన్సిడెంట్ కథతో ఓ సినిమా చేస్తున్నాను అని తెలిపారు.