Siree Lella : హ్యాపీ బర్త్ డే పెద మామయ్య.. చంద్రబాబుకు స్పెషల్ విషెష్ చెప్పిన హీరోయిన్.. ఫోటో వైరల్..
నేడు ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు.

Actress Siree Lella Special Birthday Wishes to CM Chandrababu Naidu
Siree Lella : నేడు ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు. దీంతో పలువురు సెలబ్రిటీలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినిమా సెలబ్రిటీలు సైతం చంద్రబాబుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఓ హీరోయిన్ సీఎం చంద్రబాబు నాయిడుకి తెలిపిన స్పెషల్ శుభాకాంక్షలు వైరల్ గా మారాయి.
Also See : ‘కుబేరా’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. ధనుష్ మాస్ స్టెప్పులు.. పాట పాడింది కూడా అతనే..
ప్రతినిధి 2 సినిమాలో నటించిన హీరోయిన్ సిరి లేళ్ల సీఎం చంద్రబాబు కాళ్లకు నమస్కరిస్తున్న ఫోటో షేర్ చేసి.. హ్యాపీ బర్త్ డే పెద మామయ్య గారు అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకు, హీరో నారా రోహిత్ ని సిరి లేళ్ల గత సంవత్సరం అక్టోబర్ లో నిశ్చితార్థం చేసుకుంది. అలా ఈ హీరోయిన్ కి చంద్రబాబు మామయ్య వరుస అవుతారు. వీరి నిశ్చితార్థంనికి సీఎం చంద్రబాబు కూడా హాజరయ్యారు. నిశ్చితార్థంలో దిగిన ఫోటోని షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపింది సిరి.
నారా రోహిత్ – సిరి లేళ్ల లకు ప్రతినిధి 2 సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. అయితే నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజులకు నారా రోహిత్ తండ్రి మరణించడంతో ప్రస్తుతానికి పెళ్లిని వాయిదా వేశారు.
View this post on Instagram