Kubera Song : ‘కుబేరా’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. ధనుష్ మాస్ స్టెప్పులు.. పాట పాడింది కూడా అతనే..

ధనుష్, నాగార్జున, రష్మిక మెయిన్ లీడ్స్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేర సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసారు. ఈ పాటని ధనుష్ పాడటం గమనార్హం.

Kubera Song : ‘కుబేరా’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. ధనుష్ మాస్ స్టెప్పులు.. పాట పాడింది కూడా అతనే..

Dhanush Nagarjuna Rashmika Sekhar Kammula Kubera Movie First Song Released

Updated On : April 20, 2025 / 3:50 PM IST

Kubera Song : ధనుష్ ఇటీవల తెలుగులో కూడా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ముఖ్య పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కుబేర’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Also Read : Anchor Rashmi : సర్జరీ చేయించుకున్న ‘యాంకర్ రష్మీ’.. జనవరి నుంచి బాధపడుతూ.. హాస్పిటల్ నుంచి ఫోటో షేర్ చేసి..

ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ అవ్వగా తాజాగా కుబేర సినిమా నుంచి మొదటి పాటని రిలీజ్ చేసారు. పోయిరా మామ.. అంటూ సాగే ఈ పాటని దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో భాస్కరభట్ల రాయగా హీరో ధనుష్ స్వయంగా పాడాడు. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..

ఇక ఈ పాటలో ధనుష్ మాస్ స్టెప్స్ అదరగొట్టారు. కుబేర సినిమా తెలుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అవుతుండటంతో పాటను కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ మాస్ బీట్ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. తమిళ్ ఆడియన్స్ కి, ధనుష్ ఫ్యాన్స్ కి కూడా ఈ సాంగ్ తెగ నచ్చేసింది.

Also Read : Tejaswini Gowda – Amardeep Chowdary : అమర్ దీప్ తో విడాకులపై క్లారిటీ ఇచ్చిన నటి తేజస్విని గౌడ్..

వరుస హిట్స్ తో ఉన్న ధనుష్ క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో పనిచేయడం ఇందులో నాగార్జున కూడా నటించడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక కుబేర సినిమా జూన్ 20న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది.