Dhanush – Nayanthara : ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్.. కానీ ఇప్పుడు వివాదం ఎందుకు.. ధనుష్ వర్సెస్ నయనతార..

ధనుష్, నయనతార జంటగా గతంలో యారాడి నీ మోహిని(తెలుగులో ఆడవారి మాటలకు అర్దాలే వేరులే సినిమా) సినిమాలో నటించారు. అప్పుడు వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.

Dhanush – Nayanthara : ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్.. కానీ ఇప్పుడు వివాదం ఎందుకు.. ధనుష్ వర్సెస్ నయనతార..

Why Dhanush Nayanthara Friendship Failed Here the Details

Updated On : November 17, 2024 / 9:45 PM IST

Dhanush – Nayanthara : నయనతార నిన్న ధనుష్ పై ఫైర్ అవుతూ, ధనుష్ పై తీవ్ర విమర్శలు చేస్తూ ఓ పెద్ద లేఖ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నయన్ భర్త విగ్నేష్ శివన్ కూడా ధనుష్ ని విమర్శిస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. నయనతార లైఫ్ పై నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ తీశారు. దానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేయగా అందులో నానుమ్ రౌడీ దాన్ సినిమాకు సంబంధించి వర్కింగ్ వీడియో ఒకటి ప్లే చేసారు. దానికి నిర్మాత ధనుష్ కావడంతో తన అనుమతి లేకుండా అప్లయ్ చేసారని నయనతారకు 10 కోట్లు కట్టమని లీగల్ నోటిస్ పంపించాడు.

దీంతో నయనతార రెండేళ్ల నుంచి నీ పర్మిషన్ కోసం తిరిగాము నువ్వు ఇవ్వట్లేదు, అయినా మా ఫోన్ లో తీసుకున్న దానికి నీకు ఎందుకు డబులు కట్టాలి, నువ్వు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టావు అంటూ తీవ్ర విమర్శలు చేస్తూ పబ్లిక్ గా పోస్ట్ పెట్టడంతో తమిళ పరిశ్రమలో సంచలనంగా మారింది. దీంతో ధనుష్ ఫ్యాన్స్, నెటిజన్లు నయనతారని విమర్శిస్తున్నారు. తను మాత్రం తన లైఫ్ స్టోరీని కోట్లకు అమ్ముకోవచ్చు కానీ ధనుష్ అడిగితే తప్పా అంటూ విమర్శలు చేస్తున్నారు. ఓ తమిళ నిర్మాత, ఓ నటి కూడా నయనతార మమ్మల్ని తొక్కేసిందంటూ విమర్శలు చేసారు. దీంతో తమిళనాట ఈ వివాదం మరింత పెద్దది అయింది. అయితే అసలు నయనతార – ధనుష్ ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు వీరి మధ్య ఈ గ్యాప్ రావడానికి కారణం ఏంటి అని అంతా ఆలోచిస్తున్నారు.

Also See : Pushpa 2 Trailer Launch event : పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు..

ధనుష్, నయనతార జంటగా గతంలో యారాడి నీ మోహిని(తెలుగులో ఆడవారి మాటలకు అర్దాలే వేరులే సినిమా) సినిమాలో నటించారు. అప్పుడు వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఇంటర్వ్యూలలో, ఆ సినిమా ప్రమోషన్స్ లో కూడా బాగానే కలిసి తిరిగారు. ఆ తర్వాత ధనుష్ నిర్మాతగా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఆగిపోయిన సినిమాను తీసుకొని నయనతార, విజయ్ సేతుపతి జంటగా నానుమ్ రౌడీ దాన్(తెలుగులో నేను రౌడీనే) సినిమాని మొదలుపెట్టారు.

అయితే ఈ సినిమాకు ముందు అనుకున్నది 6 కోట్లు బడ్జెట్ అయినా చివరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 16 కోట్లు అయిందట. అంతేకాక ఈ సినిమా షూటింగ్ చాలా లేట్ అయిందట. ఈ విషయంలో ధనుష్ నిరాశ చెందాడు. ధనుష్ అనుకున్న దానికంటే తక్కువ రేటుకే ఈ సినిమా అమ్మేయడంతో సినిమా హిట్ అయినా ధనుష్ కి పెద్దగా ప్రాఫిట్ రాలేదు. విగ్నేష్ పై ధనుష్ కి కోపం వచ్చిందని, తిట్టాడని కూడా అప్పట్లో తమిళ్ సినీ పరిశ్రమలో వినిపించింది. అలాగే ఈ సినిమాలో నయనతార పర్ఫార్మెన్స్ ధనుష్ కి నచ్చలేదని కూడా టాక్. ఓ ఈవెంట్లో నయనతార డైరెక్ట్ స్టేజిపైనే నా పర్ఫార్మెన్స్ ఆ సినిమాలో నచ్చనందుకు సారీ అని ధనుష్ కి చెప్పింది.

దీంతో ఆ సినిమా తనకు నష్టం మిగిల్చిందని, తన సమయం కూడా తినేసిందని ధనుష్ కి కోపం పైగా నయనతార, విగ్నేష్ ఆ సినిమా బడ్జెట్ ని ధనుష్ ని పట్టుబట్టి ఒప్పించారట. ఇది కూడా నయన్ పై ధనుష్ కి కోపం తెప్పించిందట. ఇక నయనతార చెప్పిన ప్రకారం అయితే ఆ సినిమాతో తనకు మంచి సక్సెస్ వచ్చి స్టార్ హీరోయిన్ అయిపోవడం ధనుష్ తట్టుకోలేకపోయాడు అని చెప్పింది. దీంతో ఆ ఒక్క సినిమా ధనుష్ – నయనతార మధ్యలో ఇలా దూరం పెరిగేలా చేసింది. అయితే ఈ సినిమాతోనే విగ్నేష్ – నయన్ పరిచయమై ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారని, ఈ సినిమా తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని, ఈ సినిమాలో మంచి సాంగ్స్ వచ్చాయని నయన్ కు ఈ సినిమా స్పెషల్ గా నిలిచింది. అందుకే ఆ సినిమాకు సంబంధించిన కంటెంట్ వాడుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోవడంతో ధనుష్ పై ఇలా ఫైర్ అయింది. మరి వీరి మధ్య గొడవ సాగుతుందా సద్దుమణుగుతుందా చూడాలి.