Swayambhu: నిఖిల్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. పోస్టర్ లో అది మిస్ అయ్యింది.. గమనించారా?

నిఖిల్ సిద్దార్థ్ హీరోగా వస్తున్న పీరియాడికల్ డ్రామా స్వయంభూ(Swayambhu) సినిమా నుంచి న్యూ ఇయర్ సందర్బంగా మేకర్స్ కొత్త పోస్టర్ విడుదల చేశారు.

Swayambhu: నిఖిల్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. పోస్టర్ లో అది మిస్ అయ్యింది.. గమనించారా?

Will Nikhil movie 'Swayambhu' be postponed once again_

Updated On : January 1, 2026 / 8:14 PM IST
  • నిఖిల్ భారీ సినిమా స్వయంభూ
  • న్యూ ఇయర్ సందర్బంగా కొత్త పోస్టర్ విడుదల
  • పోస్టర్ లో మిస్సైన రిలీజ్ డేట్

Swayambhu: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా వస్తున్న మూవీ స్వయంభూ. పీడియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. నిఖిల్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మేకింగ్ వీడియోస్ ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. దీంతో, ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ కి వస్తుందా అంటూ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.అయితే, మేకర్స్ ఇప్పటికే ప్రకటించినట్టుగా స్వయంభూ(Swayambhu) సినిమాను ఫిబ్రవరి 13న విడుదల చేయాలనీ ప్లాన్ చేశారు. నిజానికి దాదాపు రెండేళ్ల క్రితమే స్వయంభూ సినిమా చిత్రీకరణ స్టార్ట్ అయ్యింది. కానీ, మేకింగ్ లో జరిగిన ఆలస్య వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది.

Thanuja Puttaswamy: బంతిపువ్వు రంగు చీరలో పూబంతిలా.. తనూజ లేటెస్ట్ ఫొటోస్

ఎట్టకేలకు ఫిబ్రవరిలో రానుంది అని నిఖిల్ ఫ్యాన్స్ కాస్త ఆనందం వ్యక్తం చేశారు. కానీ, రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ సినిమా ఫిబ్రవరిలో రావడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. కారణం ఏంటంటే, న్యూ ఇయర్ సందర్బంగా స్వయంభూ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఆ పోస్టర్ చూసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. కానీ, ఆ పోస్టర్ లో గతంలో కనిపించిన రిలీజ్ డేట్ కనిపించలేదు.

దీంతో, స్వయంభూ సినిమా మరోసారి వాయిదా పడటం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. స్వయంభూ సినిమా భారీ గ్రాఫిక్స్ తో రానుంది. కానీ, గ్రాఫిక్స్ ఫినిషింగ్ కోసం మరింత సమయాన్ని తీసుకోనున్నారట మేకర్స్. దీంతో, మరోసారి ఈ సినిమా వాయిదా పడనుంది. ఇక త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటన మేకర్స్ నుంచి రానుంది.