Puneeth Rajkumar : పునీత్ మృతితో రెండు రోజులు వైన్ షాప్స్ బంద్

వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కర్ణాటక ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. పునీత్ అంతక్రియలు జరిగే వరకు అంతా సాఫీగా ఉండేలా కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

Puneeth Rajkumar : పునీత్ మృతితో రెండు రోజులు వైన్ షాప్స్ బంద్

Rajkumar

Updated On : October 30, 2021 / 12:30 PM IST

Puneeth Rajkumar :  కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిన్న గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. కన్నడలో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరో పునీత్. ఈయన మరణ వార్త విని అభిమానులు హాస్పిటల్ వద్దకు పోటెత్తారు. నిన్న రాత్రి పునీత్ ఇంటి వద్ద భౌతిక కాయాన్ని ఉంచారు. ఇవాళ అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం పునీత్ పార్థివ దేహాన్ని బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచారు. ఇప్పటికే అభిమానులు లక్షల్లో తరలి వస్తున్నారు తమ అభిమాన హీరోని చివరి చూపు చూడటానికి. మరో వైపు సెలబ్రిటీలు కూడా బెంగుళూరుకు తరలి వస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కర్ణాటక ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. పునీత్ అంతక్రియలు జరిగే వరకు అంతా సాఫీగా ఉండేలా కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ పై 200 కోట్ల పెట్టుబడులు.. ఇప్పుడు ఆ సినిమాల పరిస్థితి??

ఈ చర్యల్లో భాగంగా కర్ణాటకలో ఇవాళ, రేపు రెండు రోజులు పూర్తిగా మద్యపాన విక్రయాలని బంద్ చేసింది. మద్యం షాపులని ఈ రెండు రోజులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని చోట్ల పోలీసు బందోబస్తుని భారీగా మోహరింపచేసింది. స్కూల్స్ కి, కాలేజీలకు ప్రస్తుతం సెలవులు ప్రకటించారు. ఇప్పటికే థియేటర్స్ కూడా బంద్ చేశారు. ఇవాళ షూటింగ్స్ కూడా నిలిపివేసినట్టు తెలుస్తుంది. పునీత్ రాజ్ కుమార్ అభిమానులని సంయమనం పాటించాలని కోరింది కర్ణాటక ప్రభుత్వం. పునీత్ అంతక్రియలు ముగిసి మామూలు పరిస్థితి ఏర్పడే వరకు కర్ణాటకలో ఈ చర్యలు కొనసాగుతాయని తెలుస్తుంది.