హీరోయిన్ల దుస్తులపై కామెంట్ల ఇష్యూ.. సినీనటుడు శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు

మహిళా కమిషన్ ముందు ఈ నెల 27వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ..

హీరోయిన్ల దుస్తులపై కామెంట్ల ఇష్యూ.. సినీనటుడు శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు

Updated On : December 23, 2025 / 7:05 PM IST

Actor Shivaji: హీరోయిన్ల దుస్తులపై దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినీనటుడు శివాజీ చేసిన కామెంట్లపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. శివాజీకి నోటీసులు పంపింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు శివాజీకి నోటీసులు జారీచేసింది. మహిళా కమిషన్ ముందు ఈ నెల 27వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.

Also Read: అందరు అమ్మాయిలను ఉద్దేశించి నేను మాట్లాడలేదు.. హీరోయిన్లను మాత్రమే.. సారీ: సినీనటుడు శివాజీ

కాగా, తాను చేసిన వ్యాఖ్యలకు బాధపడితే క్షమించాలని శివాజీ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను అందరు అమ్మాయిలను ఉద్దేశించి మాట్లాడలేదని అన్నారు. తన ఉద్దేశం మంచిదే కానీ, ఆ రెండు అన్‌పార్లమెంటరీ పదాలు దొర్లకుండా ఉంటే బాగుండేదని చెప్పారు. సినీ పరిశ్రమలో మహిళల మనోభావాలు దెబ్బతిన్నందుకు తాను క్షమాపణలు చెబుతున్నానని శివాజీ చెప్పారు.

కాగా, నిన్న సాయంత్రం దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ.. హీరోయిన్లు ఎలాపడితే అలా బట్టలు వేసుకోకూడదని చెప్పారు. మహిళ అందం చీరల్లో, నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుందని, అప్పుడే వారి గౌరవం పెరుగుతుందని అన్నారు. పొట్టి దుస్తులు ధరిస్తే పైకి నవ్వుతూ బాగుంది అంటారని, లోపల మాత్రం మంచి బట్టలు వేసుకోవచ్చుగా అని తిట్టుకుంటారని వ్యాఖ్యానించారు. దీంతో సినీ పరిశ్రమలోని పలువురు మహిళలు మండిపడుతున్నారు.