పెన్సిల్‌పై ప్రభాస్ పేరు చూశారా!
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమాని ఒకరు పెన్సిల్‌పై ప్రభాస్ పేరు చెక్కి ప్రభాస్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు..

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమాని ఒకరు పెన్సిల్‌పై ప్రభాస్ పేరు చెక్కి ప్రభాస్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు..
రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి : ది బిగినింగ్, బాహుబలి : ది కన్‌క్లూజన్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడతని సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే.. దేశ, విదేశాల్లో ప్రభాస్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్ నుండి హైదరాబాద్ వచ్చి ప్రభాస్ ఇంటి దగ్గర లేడీ ఫ్యాన్స్ చేసిన హంగామా ఇటీవలే చూశాం.
ఇప్పుడు ప్రభాస్ అభిమాని ఒకరు పెన్సిల్‌పై ప్రభాస్ పేరు చెక్కి ప్రభాస్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు. పెన్సిల్‌ను బాగా షార్ప్ చేసి దానిపై ఇంగ్లీష్‌లో ప్రభాస్ పేరు చెక్కడం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
Read Also : కోమలి రీమేక్‌లో అర్జున్ కపూర్..
సాహో తర్వాత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ప్రభాస్.. త్వరలో ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న ‘జాన్’ (పరిశీలనలో ఉన్న టైటిల్) షూటింగ్‌లో జాయిన్ అవుతాడు. లవ్ స్టోరీగా తెరకెక్కబోయే ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.