Tiger Vs Pathaan : స్పై యూనివర్స్ మూవీస్ అనౌన్స్ చేసిన యష్ రాజ్ ఫిలిమ్స్..
పఠాన్ (Pathaan) సినిమాలో సల్మాన్ ఖాన్ ని తీసుకు వచ్చి స్పై యూనివర్స్ కి తెరలేపిన యష్ రాజ్ ఫిలిమ్స్.. ఇప్పుడు తమ తదుపరి స్పై సిరీస్ మూవీస్ అనౌన్స్ చేశారు

Yash Raj Films announces Tiger 3 War 2 Tiger Vs Pathaan
Tiger Vs Pathaan : ఈ మధ్య కాలంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మేకర్స్ అంతా ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఒక కథని మరో కథతో లింక్ చేస్తూ పలు సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. కాగా బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ యష్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) కూడా ఇటీవల తమ సినిమాటిక్ యూనివర్స్ కి తెర లేపారు. ఈ నిర్మాణ సంస్థలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్స్ Ek Tha Tiger, Tiger Zinda Hai, War సినిమాలు సూపర్ హిట్టుగా నిలిచాయి.
War 2 : వార్ 2 అనౌన్స్ చేసిన హృతిక్.. టైగర్‌తో స్పై యూనివర్స్‌లోకి ఎంట్రీ షురూ..
ఇక ఇటీవల ఈ ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన పఠాన్ (Pathaan) సినిమాలోకి టైగర్ సిరీస్ లోని సల్మాన్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసి స్పై యూనివర్స్ మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ యూనివర్స్ లో వచ్చే తదుపరి ప్రాజెక్ట్స్ ని అధికారికంగా అనౌన్స్ చేసింది. టైగర్ – 3, వార్ -2, టైగర్ v/s పఠాన్.. అనే మూడు ప్రాజెక్ట్స్ ని ప్రకటించారు. ఆల్రెడీ టైగర్ – 3 మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. వార్ సీక్వెల్ ఈ ఏడాది చివరిలో పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. వార్ 2 సినిమా టైగర్ 3 కి కొనసాగింపుగా తెరకెక్కుతోందని కూడా తెలియజేశారు.
Samantha : నాగచైతన్యపై సమంత నిజంగానే ఆ వ్యాఖ్యలు చేసిందా.. క్లారిటీ ఇచ్చిన సమంత
అయితే ఈ యూనివర్స్ లో ఆసక్తి రేపుతున్న ప్రాజెక్ట్ ఏంటంటే.. టైగర్ v/s పఠాన్ (Tiger Vs Pathaan). టైటిల్ బట్టి ఈ సినిమాలో షారుఖ్ అండ్ సల్మాన్ ఒకరితో ఒకరు పోటీ పడబోతున్నట్లు తెలుస్తుంది. పఠాన్ సినిమాలో వీరిద్దరూ కేవలం ఒక 5 నిమిషాలు కనిపించినందుకే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఆడియన్స్ లో ఇప్పటి నుంచే భారీ హైప్ నెలకుంది. ఇప్పుడు ఒకరితో ఒకరు తలబడబోతున్నారు అంటే ఈసారి ఇంకెన్ని రికార్డులు కొల్లగొడతారో చూడాలి.
YRF SPY UNIVERSE…
⭐️ #EkThaTiger
⭐️ #TigerZindaHai
⭐️ #War
⭐️ #PathaanForthcoming Films…
⭐️ #Tiger3
⭐️ #War2
⭐️ #TigerVsPathaan#YRFSpyUniverse pic.twitter.com/533rabc4IL— taran adarsh (@taran_adarsh) April 4, 2023