Yegire Manasey : టైగర్ 3 నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. ఏడు విభిన్న లుక్స్‌లో మతిపోగొట్టిన కత్రినా..!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా టైగర్ 3.

Yegire Manasey song
Yegire Manasey song : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా టైగర్ 3. టైగర్ సిరీస్‌లో వస్తున్న మూడో చిత్రం ఇది. మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర్ 12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఫస్ట్ లుక్, గ్లింప్స్, ట్రైలర్‌లను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు.
Nani 31 : ‘సరిపోదా శనివారం’ అంటున్న నాని.. నాని 31 సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్..
ఎగిరే మనసే అంటూ ఈపాట సాగుతోంది. ఈ పాటలో హీరోయిన్ కత్రినా ఏడు విభిన్నమైన లుక్స్‌లో కనిపించి ఆకట్టుకుంది. సాంగ్ చూస్తే పుల్ పార్టీ మోడ్‌లా ఉంది. ఈ చిత్రాన్ని యష్ రాజ్ బ్యానర్‌పై ఆదిత్యా చోప్రా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ఇమ్రాన్ హష్మీ, అశుతోష్ రాణా, అనుప్రియా గోమెంకా, రిద్ధి డోగ్రా, అంగద్ బేడీ లాంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.