Yogi Adityanath : యూపీ సీఎం ‘యోగి ఆదిత్యనాథ్’ పై బయోపిక్.. రిలీజ్ ఎప్పుడంటే..

తాజాగా నేడు యోగి ఆదిత్యనాథ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Yogi Adityanath : యూపీ సీఎం ‘యోగి ఆదిత్యనాథ్’ పై బయోపిక్.. రిలీజ్ ఎప్పుడంటే..

Yogi Adityanath Biopic Ajey Movie Release Date Announced

Updated On : June 5, 2025 / 5:35 PM IST

Yogi Adityanath : సినీ పరిశ్రమలో ఇటీవల అన్ని రంగాల ప్రముఖులపై బయోపిక్స్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎంగా తన పాలనతో మెప్పిస్తున్న యోగి ఆదిత్యనాథ్ పై కూడా కొన్నాళ్ల క్రితం బయోపిక్ అజేయ్ అనే పేరుతో అనౌన్స్ చేసారు. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు. తాజాగా నేడు యోగి ఆదిత్యనాథ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Also Read : Manchu Vishnu : ఇలా కూడా సేవ్ చేసుకుంటారా? అసలు పేర్లే లేకుండా.. ఇది మంచు విష్ణు స్టైల్..

సామ్రాట్ సినిమాటిక్స్ బ్యానర్ పై రీతూ మెంగి నిర్మాణంలో రవీంద్ర గౌతమ్ దర్శకత్వంలో ‘అజేయ్ – ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ యోగి’ బయోపిక్ తెరకెక్కుతుంది. ఈ సినిమాని 2025 ఆగస్టు 1న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో అనంత్ జోషి యోగి పాత్రలో కనిపించబోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Samrat Cinematics (@samratcineindia)

Also Read : Balakrishna : ‘మ్యాన్షన్ హౌస్ వేసినోడు మహానుభావుడు..’ బాలయ్య రీ రిలీజ్ సినిమా కోసం స్పెషల్ సాంగ్.. విన్నారా?