త్రివిక్రమ్‌తో తారక్ 30 – 2021 వేసవిలో విడుదల!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీ చిత్రం..

  • Published By: sekhar ,Published On : February 19, 2020 / 12:07 PM IST
త్రివిక్రమ్‌తో తారక్ 30 – 2021 వేసవిలో విడుదల!

Updated On : February 19, 2020 / 12:07 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీ చిత్రం..

తారక్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న#Tarak30 అప్ డేట్ వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ‘అరవింద సమేత’ తర్వాత ఓ సినిమా తెరకెక్కనుందని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ వివరాలు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసినదే. ఇదే కలయికలో ఇప్పుడు మరొక చిత్రం త్వరలో ప్రారంభం కాబోతోంది. ‘RRR’ చిత్రం తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోయే చిత్రం ఇది.

 

ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి తారక్, త్రివిక్రమ్ సినిమాను నిర్మంచనున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మాతలు. త్రివిక్రమ్ గతకొంత కాలంగా హారిక హాసిని బ్యానర్‌లోనే కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తున్నాడు. తనకు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలను చినబాబుతో టై అప్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు.

తారక్ ఈ సినిమాను అన్నయ్య కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో చేయాల్సి ఉంది. త్రివిక్రమ్ తరపున చినబాబు, తారక్ తరపున కళ్యాణ్ రామ్ నిర్మాతలుగా ఫిక్స్ అయ్యారు. 2020 వేసవిలో షూటింగ్ ప్రారంభం కానుంది.

సమ్మర్ స్పెషల్‌గా 2021 ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇతర నటీ నటుల మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం అని చిత్ర బృందం తెలిపింది. 

త్రివిక్రమ్ ఒక సోషల్ ఎలిమెంట్ తీసుకుని కథ రెడీ చేశాడని, ‘‘అయినను పోయి రావలెను హస్తినకు’’ అనే టైటిల్ ఫిలిం చాంబర్లో రిజిష్టర్ చేయించారని తెలుస్తోంది. ఢిల్లీ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది.  

Young Tiger NTR, Trivikram  are coming together again for NTR 30