YSR Lifetime Achievement Award 2022 : K. విశ్వనాథ్, R. నారాయణమూర్తిలకు వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు..

ఏపీ ప్రభుత్వం గత సంవత్సరం నుంచి వైఎస్సార్ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌‌మెంట్, వైఎస్సార్‌ అచీవ్‌‌మెంట్‌ పురస్కారాలను అందిస్తున్నారు. పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డుని ఇస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఈ అవార్డులని..................

YSR Lifetime Achievement Award 2022 : K. విశ్వనాథ్, R. నారాయణమూర్తిలకు వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు..

YSR Lifetime Achievement Awards 2022

Updated On : October 19, 2022 / 12:28 PM IST

YSR Lifetime Achievement Award 2022 :  ఏపీ ప్రభుత్వం గత సంవత్సరం నుంచి వైఎస్సార్ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌‌మెంట్, వైఎస్సార్‌ అచీవ్‌‌మెంట్‌ పురస్కారాలను అందిస్తున్నారు. పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డుని ఇస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఈ అవార్డులని ఇటీవలే ప్రకటించారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన దాదాపు 30 మందికి ఈ వైఎస్సార్ అవార్డుని ఇవ్వనున్నారు. సినిమా రంగానికి సంబంధించి ఈ సంవత్సరం కళాతపస్వి కె.విశ్వనాథ్, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి గార్లకి వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించారు.

Prince : సినిమా టికెట్లు ఇలా కూడా బుక్ చేస్తారా?? శివ కార్తికేయన్ ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదుగా..

నవంబర్ 1న ఈ అవార్డుని వారికి అందచేయనున్నారు. వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు తనకి రావడంతో ఆర్.నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు నాకు, విశ్వనాథ్ గారికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా ప్రజా సమస్యలని చూపిస్తూ ప్రజా చిత్రాలని తీస్తున్నాను. నేడు మన ముఖ్యమంత్రి జగన్ గారు, ఏపీ ప్రభుత్వం నన్ను గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు.