Zamana : దీపావళి నాడు ‘జమాన’ టైటిల్ ప్రోమో రిలీజ్.. హిట్ దర్శకుడు వెంకీ కుడుముల చేతుల మీదుగా..
ఈ తరం యువత ఆలోచనలకు అద్దం పట్టే ఒక ఆసక్తికరమైన కథ, కథనాలతో తెరకెక్కుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ `జమాన`. పవర్‌స్టార్ పవన్‌కళ్యాన్ `బ్రో` సినిమాతో సుపరిచితుడైన సూర్య శ్రీనివాస్ మరియు సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

Zamana Title Promo Released by Venky Kudumula on Diwali
Zamana Title Promo : ఇటీవల కథా బలం ఉన్న చిన్న సినిమాలకు కూడా ప్రేక్షకులు పెద్ద విజయాలు ఇస్తున్నారు. కంటెంట్ ఉన్న సినిమాకు మంచి ప్రాధాన్యత దక్కుతుంది. ఈ కోవలోనే ఈ తరం యువత ఆలోచనలకు అద్దం పట్టే ఒక ఆసక్తికరమైన కథ, కథనాలతో తెరకెక్కుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ `జమాన`. పవర్‌స్టార్ పవన్‌కళ్యాన్ `బ్రో` సినిమాతో సుపరిచితుడైన సూర్య శ్రీనివాస్ మరియు సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
శ్రీ లక్ష్మీ వల్లభ క్రియేషన్స్, విఎస్ అసోసియేట్స్ పతాకాలపై తేజస్వి అడప మరియు బొద్దుల లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భాస్కర్ జక్కుల దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయమవుతున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ ప్రోమోను హిట్ చిత్రాల దర్శకుడు వెంకీ కుడుముల దీపావళి నాడు విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే దొంగతనాల మీద సినిమా కథ ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
టైటిల్ ప్రోమో విడుదల అనంతరం డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ.. జమాన టైటిల్ ప్రోమో చూశాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన సూర్య శ్రీనివాస్, సంజయ్‌కి ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ భాస్కర్ జక్కుల విజన్ బాగా నచ్చింది. టైటిల్ ప్రోమోలో చార్మినార్ దగ్గర షాట్స్ బాగాఉన్నాయి. డిఓపి చక్కగా తీశారు. ఈ సినిమాకు సంబందించి ఎలాంటి సహాయం కావాలన్నా నా టీమ్ అందుబాటులో ఉంటుంది. ఈ సినిమా నిర్మాతలకు, చిత్ర యనిట్ కు ఆల్ ది బెస్ట్ అని తెలిపారు.
హీరో సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ.. మేం అడగగానే వెంటనే మా జమాన టైటిల్ ప్రోమోను విడుదల చేసిన వెంకీ కుడుముల గారికి థ్యాంక్స్. ఆయనది లక్కీ హ్యాండ్. ఆయన చేతుల మీదుగా విడుదలైన మా జమాన సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. మా డైరెక్టర్ భాస్కర్ గారు నేటి యువతకు సంబందించి ఒక అద్భుతమైన కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకి థ్యాంక్స్ అని అన్నారు.
Also Read : Bigg Boss 7 Day 70 : దీపావళి రోజు హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది ఎవరు?
ఇక దర్శకుడు భాస్కర్ జక్కుల మాట్లాడుతూ.. జమాన టైటిల్ ప్రోమో రిలీజ్ చేసిన దర్శకులు వెంకీ కుడుముల గారికి థ్యాంక్స్. చార్మినార్, ఓల్డ్ సిటీ బ్యాక్‌డ్రాప్ లో యూత్ కి నచ్చే విధంగా జమాన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. ఫస్ట్ మూవీ అయినా యాక్టర్స్, టెక్నీషియన్స్ మంచి సపోర్ట్ ఇచ్చారు. అలాగే ఈ కథని నమ్మి ప్రొడ్యూస్ చేసిన మా నిర్మాతలకి థ్యాంక్స్. త్వరలోనే మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో మీ ముందుకు వస్తాం అని తెలిపారు.