ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం : 10 మంది నవజాత శిశువులు సజీవదహనం

10 Children Charred to Death as Massive Fire Break : మహారాష్ట్రలోని భండారాలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది నవజాత సజీవ దహనమయ్యారు.
అర్ధరాత్రి ఐసీయూలో మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఐసీయూలో 17మంది చిన్నారులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ 17మంది నవజాత శిశువులను భండారా జిల్లా ఆస్పత్రిలోని న్యూ బోర్న్ నాటల్ వార్డులో ఉంచారు.
శనివారం అర్ధరాత్రి సమయంలో వార్డులో నుంచి పొగలు రావడాన్ని గమనించినట్టు ఒక నర్సు చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు . కొద్దిసేపటి తరువాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది వార్డులోని శిశువులను బయటకు తరలించారు.
అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులకు ఐసియూలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు మంటలు చెలరేగాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. 7 మంది పిల్లలను మంటల నుండి సురక్షితంగా రక్షించారు.
మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆస్పత్రి సిక్ న్యూబోర్న్ కేర్ యూనిట్ (SSCU) లో మంటలు చెలరేగాయని జిల్లా ఆస్పత్రి సివిల్ సర్జన్ డాక్టర్ ప్రమోద్ తెలిపారు. మంటల్లో 10 మంది చిన్నారులు మృతిచెందగా, 7 మంది శిశువులను సురక్షితంగా రక్షించినట్టు వెల్లడించారు.
Ten children died in a fire that broke out at Sick Newborn Care Unit (SNCU) of Bhandara District General Hospital at 2 am today. Seven children were rescued from the unit: Pramod Khandate, Civil Surgeon, Bhandara, Maharashtra pic.twitter.com/bTokrNQ28t
— ANI (@ANI) January 9, 2021