ఒకే జైలులో 77మందికి కరోనా పాజిటివ్

  • Published By: vamsi ,Published On : May 8, 2020 / 06:08 AM IST
ఒకే జైలులో 77మందికి కరోనా పాజిటివ్

దేశంలోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఈ రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉంది. రోజురోజుకు పరిస్థితులు చెయ్యిదాటి పోతూ ఉండగా.. ముంబైలో మరణాలు కూడా అత్యధికంగా నమోదవుతున్నాయి. 

మహారాష్ట్రలో ఇప్పటికే 16వేల 758మంది కరోనా బారిన పడగా.. 651మంది కరోనాతో  చనిపోయారు. ఇదిలా ఉంటే ముంబైలో 10వేల 714మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. రోజురోజుకి రాష్ట్రంలో కరోనా బాధితులు, మరణాల సంఖ్య పెరుగుతోండగా.. లేటెస్ట్‌గా ఆర్థర్‌ రోడ్డు జైలులో ఏకంగా 103మందికి కరోనా వైరస్ పాజిటివ్‌ వచ్చింది. వీరిలో 77 మంది అండర్ ట్రయల్ ఖైదీలు కాగా, మిగతా వారు జైలు సిబ్బంది. 

జైలులో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వెంటనే ఈ ఉదయం బాధితులందరినీ ముంబైలోని సెయింట్ జార్జ్,  గోకుల్ తేజ్ ఆసుపత్రులకు తరలించారు. డ్రగ్ స్మగ్లింగ్ కేసులో ఇటీవల ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించారు. అతడికి కరోనా వైరస్ సోకి ఉంటుందని, అతడి నుంచి మిగతా వారికి అది సంక్రమించి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read | రద్దీని నివారించేందుకు : లిక్కర్ కొనే వారి చేతివేలిపై Ink గుర్తు