Kuno National Park: కునో నేషనల్ పార్క్‌కు మరో 12 చిరుతలు వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడు? ఏ దేశం నుంచి అంటే?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కుకు కొత్తగా మరో 12 చిరుతలను తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి చివరినాటికి దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు చిరుతలను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

cheetahs
Kuno National Park: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కుకు కొత్తగా మరో 12 చిరుతలను తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి చివరినాటికి దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు చిరుతలను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎనిమిది చిరుతలను కునో నేషనల్ పార్కులో ఉంచారు. గతఏడాది సెప్టెంబర్ 17న తన 70వ పుట్టిన రోజు సందర్భంగా ఐదు ఆడ, మూడు మగ చిరుత పులులను ప్రధాని నరేంద్ర మోదీ పార్కులో ఎన్‌క్లోజర్‌లోకి విడిచిపెట్టిన విషయం విధితమే.
1952 సంవత్సరం నాటికి భారతదేశంలో చిరుతలు అంతరించిపోయినట్లు గణాంకాలు ఉన్నాయి. అయితే, 70 సంవత్సరాల తరువాత గతేడాది భారత్‌లోకి ఈ పులులను ఆఫ్రికా ఖండంలోని నమీబియా నుంచి తీసుకొచ్చారు. తాజాగా మరో 12 చిరుత పులులను ఇండియాకు తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి చివరినాటికి దక్షిణాఫ్రికా నుంచి ఈ చిరుతలు కునో నేషనల్ పార్కు కు చేరుకుంటాయని సమాచారం. ఇందుకోసం పార్కులో ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లనుసైతం సిద్ధం చేస్తున్నారు.
Kuno National Park: చీతాల రాకపై స్థానికుల్లో ఆందోళన.. తమ ఊళ్లు ఏమవుతాయోనని భయపడుతున్న ప్రజలు
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలోని ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణాఫ్రికా అధికారులతో చర్చలు తుదిదశకు వచ్చాయని, అన్నీ అనుకున్నట్లు కుదిరితే జనవరి నెలలోనే 12 చిరుతలు కునో పార్కుకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. భారత్‌కు రావాల్సిన చిరుతలన్నీ గత ఆర్నెళ్లుగా దక్షిణాఫ్రికాలో క్వారంటైన్‌లో ఉన్నాయని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మచ్చల పిల్లి జాతుల ఖండాంతర బదిలీకి సంబంధించి ఇంకా ఒక ఎంఓయు సంతకం చేయాల్సి ఉంది.