Gurugram : ఇంట్లో పనిచేసే బాలికపై సుత్తి, ఇనుప రాడ్‌తో తీవ్ర దాడి.. వివస్త్రను చేసి వీడియో తీసిన యజమాని కుటుంబం

గురుగ్రామ్‌ క్యూబర్ సిటీలోని సెక్టార్ 57లోని ఓ ఇంట్లో బాలిక పనిచేస్తున్నారు. మహిళ, ఆమె ఇద్దరు కుమారులు బాలిక బట్టలు విప్పి చిత్రీకరించారు.

Gurugram : ఇంట్లో పనిచేసే బాలికపై సుత్తి, ఇనుప రాడ్‌తో తీవ్ర దాడి.. వివస్త్రను చేసి వీడియో తీసిన యజమాని కుటుంబం

Gurugram Family Tortured Girl

Gurugram Family Tortured Girl : గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. ఇంట్లో పని చేసే 13 ఏళ్ల బాలికను వివస్త్రను చేసి, సుత్తి మరియు ఇనుప రాడ్‌తో యజమాని కుటుంబం తీవ్ర దాడి చేసింది. గురుగ్రామ్‌లో ఇంటి సహాయకురాలిగా పని చేస్తున్న బాలికను యజమాని కుటుంబం చిత్రహింసలకు గురి చేసింది. మహిళ, ఆమె ఇద్దరు కుమారులు బాలికను వివస్త్రను చేసి సుత్తి, ఇనుప రాడ్‌తో తీవ్రంగా కొట్టారు. ఆపై బాలిక నోటికి టేపు వేశారు. బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురుకు సరిపడా తిండి కూడా పెట్టలేదని వాపోయారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్‌ క్యూబర్ సిటీలోని సెక్టార్ 57లోని ఓ ఇంట్లో బాలిక పనిచేస్తున్నారు. మహిళ, ఆమె ఇద్దరు కుమారులు బాలిక బట్టలు విప్పి చిత్రీకరించారు. తమ మాట వినకుంటే వ్యభిచార గృహానికి పంపుతామని బెదిరించారు. అంతేకాకుండా ఆమె చేతులపై యాసిడ్ పోసి, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు.

Cheating: భర్త రమ్మన్నాడని నమ్మబలికి చిత్రహింసలు.. రెండేళ్ల చిన్నారికి సిగరెట్లతో వాతలు

గత నాలుగు నెలలుగా తన కుమార్తెను కలవనివ్వడం లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాలిక తల్లి పేర్కొన్నారు. యజమాని కుటుంబం నాలుగు నెలల క్రితం చివరిసారి జీతం ఇచ్చారని వెల్లడించారు. 13 ఏళ్ల బాలికను భారత వైమానిక దళం అధికారి సహాయంతో పని చేసే స్థలంలో బాలికను ఆమె తల్లి రక్షించారు. అధికారి ముందు మోకరిల్లి బాలిక తల్లి సహాయం కోరారని పోలీసులు తెలిపారు.

గురుగ్రామ్ ఇంటికి చేరుకున్న సహాయక బృందాలు బాలిక నోటికి టేపు వేసి, గది లోపల బంధించి ఉండటాన్ని గుర్తించారు. వంట చేయడం, బట్టలు ఉతకడం నుంచి కుక్కను చూసుకోవడం వరకు అన్ని రకాల పనులు తన చేత చేయించేవారని ఆమె పోలీసులకు చెప్పారు. పోక్సో చట్టం, జువైనల్ జస్టిస్ చట్టం కింద ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.