మూతపడనున్న 140 ఏళ్ల పరేల్ రైల్వే వర్క్‌షాప్

ముంబై రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేశాఖ 140 ఏళ్ల పురాతన పరెల్ వర్క్‌షాప్‌ను మూసివేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పరెల్ వర్క్‌షాప్ కు చెందిన 715 మంది అధికారులను, కార్మికులను బడ్నేర్‌కు బదిలీ చేయాలని సోమవారం (సెప్టెంబర్ 23)న నిర్ణయించింది. ముంబై రైల్వే అడ్మినిస్ట్రేషన్ నవీన్ పాండే తీసుకున్న ఈ నిర్ణయంపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రైల్వే సిబ్బంది చెప్పిన వివరాల ప్రకారం..ఒకప్పుడు పరెల్ వర్క్‌షాప్‌లో వేలమంది ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు మిగిలి ఉన్న సిబ్బందిని కూడా వేరే ప్రాంతానికి బదిలీ చేస్తున్నారని అక్కడ పనిచేస్తున్న కార్మికులు వాపోతున్నారు. వీరిని వేరే ప్రాంతానికి తరలిస్తే కొందరు రిటైర్మెంట్ తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు.
రైల్వే అధికారుల సమాచారం ప్రకారం..మహారాష్ట్రలోని పరేల్ రైల్వే వర్క్‌షాప్ మూసివేత దిశగా ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది చాలాకాలంగా అనుకున్నదేనని ఓ అధికారి తెలిపారు. 715 మంది ఉద్యోగులు, పరేల్ వర్క్‌షాప్ అధికారులను బదిలీ చేయాలనే నిర్ణయం సరైందిక కాదని నేషనల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సెక్రటరీ జనరల్ వేణు నాయర్ అన్నారు. దీనిపై రైల్వే శాఖ మరోసారి ఆలోచించి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి డిమాండ్ చేస్తున్నారు. సెంట్రల్ రైల్వే లోకోమోటివ్ వర్క్‌షాప్, పరేల్‌ను గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే 1879 లో ఆవిరి లోకో షెడ్‌గా ఏర్పాటు చేసింది.
బదిలీ అయ్యే ఉద్యోగులు వీరే
SSE: 10
JE: 10
టెక్నీషియన్ -1: 500
సీనియర్ క్లర్క్: 5
జూనియర్ క్లర్క్: 10
హెల్పర్: 180 బదిలీ అయ్యేవారిలో ఉన్నారు.