OMG వీడియో:కడుపా?నగల కొట్టా..కిలోన్నర బంగారం మింగేసింది

నీ ఇల్లు బంగారం కానూ..అనే మాట విన్నాం..కానీ ఆమె కడుపంతా బంగారంతో నిండిపోయింది. కడుపునించి గొలుసులు, ఉంగరాలు, బ్రాస్ లెట్లు, చెవిపోగులు ఇలా ఒకటేమిటి బంగారంకొట్టే కొలువైంది ఆమె కడుపులో..అది చూసి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. ఆ బంగారం కడుపు అమ్మాయి పొట్టకోసి వాటిని బైటకు తీసి ఓ నగల దుకాణంగా పేర్చారు డాక్టర్లు.
ఇంట్లో బోల్డన్ని నగలున్నాయి. ఆ నగలు రోజుకొకటి కనిపించకుండా పోతున్నాయి. ఇంటికొచ్చినవారు ఎవరన్నా నగల్ని దొంగిలిస్తున్నారేమో అనుకున్నారు.కానీ అటువంటిదేమీ జరగలేదు.కానీ ఇంట్లో నగలు మాత్రం మాయం అయిపోతునే ఉన్నాయి. ఏంచేయాలో ఆ ఇంట్లోవారికి అర్థం కాలేదు. ఈ క్రమంలో ఆ ఇంట్లో ఉండే 26 ఏళ్ల యువతికి కడుపులో విపరీతమైన నొప్పి వచ్చింది. భోజనం చేసిన వెంటనే వచ్చిన నొప్పిని భరించలేక గిలగిలా కొట్టుకుంది. వాంతులు చేసుకుంది.
వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను స్కానింగ్ చేసిన డాక్టర్లు నోరెళ్లబెట్టారు. ఆమె కడుపులో ఏవో వస్తువులు ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే సర్జరీ చేయాలని కుటుంబ సభ్యుల్తో చెప్పటంతో వారు అంగీకరించారు. వెంటనే సర్జరీ చేసిన వారికి ఆమె కడుపులో ఉన్న బంగారు నగల్ని తీశారు. ఏదో నగల షాపులోని పెద్ద బాక్స్ లోంచి నగల్ని తీస్తున్నట్లుగా తీసుంటే అవి వస్తూనే ఉన్నాయి. అలా ఒకటీ రెండూ కాదు ఏకంగా కిలోన్నర నగల్ని బైటకు తీశారు.ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది.
రాంపూర్‌హాత్ గవర్నమెంట్ ఆసుపత్రి డాక్టర్లు యువతి కడుపులోనుంచి గొలుసులు,ముక్కు పుడకలు, చెవి పోగులు. గాజులు, బ్రాస్ లెట్లలతో సహా కిలోన్నర నగల్ని తీశారు. ఈ సర్జరీ చేసిన డాక్టర్ సిద్ధార్థ బిశ్వాస్ మాట్లాడుతూ చైనులు, ముక్కు పుడకలు, చెవి పోగులు, గాజులు, బ్రాస్లెట్ తదితర ఆభరణాలతోపాటు రూ.5, 10ల కాయిన్స్ ను కూడా తీశామని తెలిపారు. వీటిన్నింటి బరువు 1.5 కిలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని క్రమంగా కోలుకుంటోందని తెలిపారు. కాగా సదురు యువతి పేరు మాత్రం బైటపెట్టలేదు డాక్టర్లు. ఆమె ఎందుకు ఇలా నగల్ని మింగేయటం