ఇదేనా గౌరవం : రాష్ట్రపతికి 156 మంది సైనికుల లేఖ

ఢిల్లీ : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూ 156 మంది మాజీ సైనికులు లేఖ రాశారు. సైనికులను నేతలు రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని రాష్ట్రపతికి మాజీ సైకులు లేఖ రాశారు. దేశం కోసం పనిచేసే సైనికులను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవటాన్ని నిరోధించాలని లేఖలో విజ్నప్తి చేశారు 156మంది మాజీ సైనికులు.
దేశం కోసం ప్రాణాలకు సైతం అర్పించే సైనికులను తమను ఓట్ల కోసం, రాజకీయాలకు వాడుకోవటం తమకు మనస్తాపాన్ని కలిగిస్తోందని లేఖ లో పేర్కొన్నారు మాజీ సైనికులు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ సేనా వ్యాఖ్యలతో పాటు రాజకీయ నేతలు సైనికుల వస్తాలు, ఫోటోలతో ప్రచారం చేస్తున్నారని ఇటువంటి ఘటనలు తమను బాధకు గురిచేస్తున్నాయని వారు లేఖలో పేర్కొన్నారు. ఇటీవల పాకిస్థాన్ కు చిక్కి సురక్షితంగా భారత్ కు చేరుకున్న వింగ్ కమాండర్ అభినందన్ ఫోటోలను కూడా ప్రచారంలో వినియోగిస్తున్నారనీ..ఇటువంటి వాటిని నిరోధించాలని మాజీ సైనికలు రాష్ట్రపతికి రాసిన లేఖ విజ్నప్తి చేశారు. అలాగే ఈ లేఖను కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించారు. కాగా గతంలో సివిల్ ఉద్యోగులు కూడా రాష్ట్రపతికి లేఖ రాసిన విషయం తెలిసిందే.