PUBG: పేరెంట్స్ డబ్బుతో పబ్‌జీలో రూ.10లక్షల పెట్టుబడి పెట్టిన టీనేజర్

ముంబైకి చెందిన టీనేజర్ తన పేరెంట్స్ అకౌంట్ నుంచి రూ.10లక్షల డబ్బు విత్ డ్రా చేసి పబ్ జీలో ఇన్వెస్ట్ చేశాడు. పబ్జీలో వర్చువల్ క్యాష్ కొనుగోలు చేసేందుకు వీటిని వాడాడు.

PUBG: పేరెంట్స్ డబ్బుతో పబ్‌జీలో రూ.10లక్షల పెట్టుబడి పెట్టిన టీనేజర్

Pubg

Updated On : August 28, 2021 / 10:35 AM IST

PUBG: ముంబైకి చెందిన టీనేజర్ తన పేరెంట్స్ అకౌంట్ నుంచి రూ.10లక్షల డబ్బు విత్ డ్రా చేసి పబ్ జీలో ఇన్వెస్ట్ చేశాడు. పబ్జీలో వర్చువల్ క్యాష్ కొనుగోలు చేసేందుకు వీటిని వాడాడు. ముందుగా ఇది ఆన్ లైన్ గేమింగ్స్ కోసం దాచిన సొమ్ముగా చెప్పుకొచ్చాడు.

పబ్జీ ఆట వ్యసనంగా మారిపోయిన ఆ టీనేజర్.. జోగేశ్వరీ అనే ప్రాంతంలో ఉండే నివాసం నుంచి పారిపోయాడు. రూ.10లక్షలు వృథాగా ఖర్చుపెట్టాడని పేరెంట్స్ తిట్టడంతో ఇల్లు వదిలిపెట్టిపోయాడు.

ఎమ్ఐడీసీ పోలీసులను ఆశ్రయించిన పోలీసులు బుధవారం తప్పిపోయాడంటూ కంప్లైంట్ ఫైల్ చేశారు. ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు ఓ నోట్ రాశాడని ఆ తర్వాత ఇక తిరిగి రాలేదంటూ చెప్పారు. పోలీసులు క్రైమ్ బ్రాంచ్ కు సమాచారమిచ్చారు.

దీనిపై భారీ ఎత్తులో సెర్చింగ్ ఆపరేషన్ జరుగుతుంది. గురువారం మధ్యాహ్నం అతని క్లాస్ మేట్స్ సమాచారం ఇవ్వడంతో అతని ఇంటికి దగ్గర్లోని మహాకాళీ గుహలకు వెళ్లే దారిలో ఉన్నట్లుగా తెలుసుకున్నారు. సీసీటీవీ కెమెరాల్లో పరిశీలించి అతనే అని కన్ఫామ్ చేసుకున్నారు.

అంత పెద్ద మొత్తంలో డబ్బు ఇన్వెస్ట్ చేసేంత బానిసలా ఎలా మారిపోయాడని పోలీసులు పేరెంట్స్ తో పాటు అతనికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు.